News February 27, 2025

వరంగల్: విద్యార్థిని ఆత్మహత్య.. UPDATE

image

WGL నగరంలో ఉరేసుకొని బుధవారం <<15587387>>విద్యార్థిని ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. పోలీసుల ప్రకారం.. నల్గొండ జిల్లాకు చెందిన రేష్మిత WGL ములుగు రోడ్డులోని వ్యవసాయ విద్యాలయంలో ఫస్టియర్ చదువుతోంది. విద్యార్థినికి ఇంటిపై బెంగ ఉండటంతో అప్పుడప్పుడు తల్లి ఆమెతో పాటు హాస్టల్‌లో ఉండేందుకు యాజమాన్యం ఒప్పుకుంది. కాగా, నిన్న శివరాత్రి కావడంతో తోటి విద్యార్థులు సొంతూరు వెల్లగా ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

Similar News

News November 13, 2025

జూబ్లీహిల్స్ ఓటింగ్ వివరాలు

image

☛మొత్తం ఓటర్లు: 4,01,365
Male: 2,08,561
Female: 1,92,779
Others: 25
☛పోలైన ఓట్లు: 1,94,631
Male: 99,771
Female: 94,855
Others: 5
Polling Percentage: 48.49%

News November 13, 2025

ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లు.. 31మందితో జేపీసీ

image

తీవ్ర నేరారోపణలతో అరెస్టై 30 రోజులు జైల్లో ఉండే ప్రజాప్రతినిధుల తొలగింపు బిల్లును పరిశీలించేందుకు BJP MP అపరాజిత సారంగీ నేతృత్వంలో 31 మంది సభ్యుల JPC ఏర్పాటైంది. ఇందులో BJP నుంచి 15 మంది, NDA పార్టీల నుంచి 11 మంది ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు జేపీసీని బహిష్కరించడంతో మిగతా విపక్ష పార్టీలకు చోటు దక్కింది. వీటిలో ఎన్సీపీ-ఎస్పీ, అకాలీదళ్, ఎంఐఎం, వైసీపీ ఉన్నాయి.

News November 13, 2025

మా బాబును టీచర్లు చితకబాదారు: పేరెంట్స్

image

భద్రాచలం కూనవరం రోడ్‌లో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్లు చితకబాదారని తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నపిల్లాడిని ఈ విధంగా ఎందుకు కొట్టారని అడిగేందుకు వచ్చిన తమను యాజమాన్యం కలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు చేపట్టాయి.