News May 10, 2024
వరంగల్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం రంగాపురం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. రంగాపురం గ్రామానికి చెందిన గుర్రం సునీల్(32) ఇంట్లో విద్యుత్ మోటార్‌ను రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కొట్టింది. కుటుంబ సభ్యులు ములుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Similar News
News February 16, 2025
వరంగల్: భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి

భర్త దశదిన కర్మ పూర్తవ్వక ముందే భార్య మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా గురజాలలో జరిగింది. మెట్టు మల్లయ్య(78)కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. ఆయన్ను వరంగల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అదేరోజు ఆయన భార్య సమ్మక్క(69) అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రిలో చేర్చారు. ఈ నెల 6వ తేదీన మల్లయ్య మృతి చెందగా, శనివారం సమ్మక్క మృతి చెందింది. దీంతో ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
News February 16, 2025
MPTC, ZPTC ఎన్నికలు: వరంగల్ జిల్లా UPDATES

వరంగల్ జిల్లా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు-2025కు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితాను అధికారులు శనివారం విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 13 మండలాలు ఉండగా, వరంగల్, ఖిలా వరంగల్ గ్రేటర్ పరిధిలో ఉన్నాయి. 694 పోలింగ్ కేంద్రాలను ఫైనల్ చేశారు. మొత్తం 130 ఎంపీటీసీ స్థానాలకు, 11 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. వరంగల్ జిల్లాలో మొత్తం 3,85,162 మంది ఓటర్లు ఉన్నారు.
News February 16, 2025
వరంగల్: మహాశివరాత్రికి ప్రత్యేక బస్సులు

మహా శివరాత్రి పురస్కరించుకొని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్య క్షేత్రానికి వరంగల్ రీజియన్ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. వరంగల్-1 డిపో నుంచి 21 బస్సులు, హనుమకొండ 27, మహబూబాబాద్ 30, నర్సంపేట 30, పరకాల 24 బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.