News November 12, 2024
వరంగల్: వివాహిత మృతి
ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా కొడకండ్లలో చోటుచేసుకుంది. స్థానిక ఎస్సై కథనం ప్రకారం.. సట్టు శోభారాణి (33) తన భర్త తాగుతున్నాడని ఇంట్లో గొడవపడి క్షణికావేశంలో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News December 6, 2024
గిరిజన యూనివర్సిటీకి రూ.890 కోట్లు మంజూరు: మహబూబాబాద్ ఎంపీ
మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కృషి ఫలించింది. ఎంపీ చొరవతో ములుగు గిరిజన విశ్వ విద్యాలయం కోసం కేంద్రం రూ.890 కోట్లు మంజూరు చేసింది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో నెలకొల్పిన సమ్మక్క- సారక్క గిరిజన విశ్వవిద్యాలయం కోసం కేంద్రంపై ఒత్తిడి చేసి పార్లమెంట్‌లో రూ.890 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేయించినట్లు ఎంపీ ‘X’ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. దీంతో గిరిజన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 6, 2024
వరంగల్ భద్రకాళి అమ్మవారికి పూజలు
వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు అభిషేకం నిర్వహించారు. నేడు అమ్మవారికి ప్రీతికరమైన రోజు శుక్రవారం కావడంతో తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.
News December 5, 2024
ములుగు: విషమిచ్చి కిరాతకంగా చంపారు: మావోయిస్టు లేఖ
ద్రోహి ఇచ్చిన సమాచారంతో ఈ నెల 1వ తేదీన చెల్పాక అడవుల్లోని పూలకమ్మ వాగు వద్ద గ్రేహౌండ్స్ బలగాలు ఏడుగురు విప్లవకారులకు విషమిచ్చి అతి కిరాతకంగా చంపారని భారత కమ్యూనిస్టు పార్టీ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ జగన్ పేరిట లేఖ విడుదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం జరిపిన పాశవిక హత్యకాండను తీవ్రంగా ఖండిస్తూ డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్ర కమిటీ బందుకు పిలుపునిస్తున్నట్లు పేర్కొన్నారు.