News December 28, 2024
వరంగల్: వేర్వేరు కారణాలతో ఆరుగురి సూసైడ్
ఉమ్మడి WGL జిల్లాలో వేర్వేరు కారణాలతో ఆరుగురు సూసైడ్ చేసుకున్నారు. వివరాలిలా.. భార్య విడాకులు ఇచ్చిందని గీసుగొండకు చెందిన శ్రీనివాస్, మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని యాదగిరి పురుగు మందు తాగారు. కాశీబుగ్గకు చెందిన రాజేశ్ పెళ్లి కావడం లేదని ఇంట్లో ఉరేసుకోగా.. కాజీపేట సమీపంలో ఓ వ్యక్తి రైలుకింద పడగా.. నెక్కొండ వాసి వీరన్న మద్యానికి బానిసై.. రాయపర్తి వాసి రాజిరెడ్డి అప్పుల బాధతో సూసైడ్ చేసుకున్నారు.
Similar News
News January 1, 2025
సమీపిస్తున్న మినీ మేడారం జాతర!
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరలో మన జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ప్రసిద్ధి చెందింది. అమ్మవార్ల మహా కుంభమేళా మరుసటి సంవత్సరం మినీ జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఫిబ్రవరి 12, 13, 14, 15వ తేదీల్లో వనదేవతల జాతర జరగనుంది. అయితే ఇప్పటికే భక్తులు వేల సంఖ్యలో నిత్యం అమ్మవార్ల దర్శనానికి తరలివస్తున్నారు. దీంతో మేడారంలో భక్తుల సందడి మొదలైంది.
News January 1, 2025
నేడు వరంగల్ ఎనుమాముల మార్కెట్కు సెలవు
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్కు నేడు (బుధవారం) సెలవు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బుధవారం నూతన సంవత్సరం సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు పేర్కొన్నారు. తిరిగి గురువారం మార్కెట్ యథావిధిగా ప్రారంభమవుతుందన్నారు. రైతులు విషయాన్ని గమనించి నేడు సరుకులు తీసుకొని రావద్దని సూచించారు.
News December 31, 2024
కొమురవెల్లి మల్లన్న ఆదాయం రూ.16.50 లక్షలు
కొమురవెల్లి మల్లన్న కళ్యాణం సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ క్రమంలో సుమారు రూ.16.50 లక్షల మేరకు బుకింగ్ ఆదాయం సమకూరినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. తలనీలాల సమర్పణ, ఆర్జిత సేవలు, పట్నాలు, బోనాలు, ప్రత్యేక దర్శనాలు, వసతి గదుల అద్దె, ప్రసాద విక్రయాలు ఇతర ద్వారా ఆదివారం రూ. 13.40 లక్షలు, సోమవారం లక్ష రూపాయల బుకింగ్ ఆదాయం సమకూరినట్లు తెలిపారు.