News April 7, 2025
వరంగల్: వేసవి వచ్చేసింది.. జాగ్రత్త!

వేసవి వచ్చేసింది. దీంతో ఉక్కబోత పెరిగింది. అయితే సాధారణంగా గ్రామాలు, పట్టణాల్లో ఉక్కబోత కారణంగా బయట పడుకుంటుంటారు. అదే అదనుగా చేసుకుని దొంగలు దొంగతనాలకు పాల్పడే అవకాశముందని అధికారులు హెచ్చరిస్తున్నారు. బంగారు ఆభరణాలు, ఫోన్లు దొంగిలించే అవకాశముందని చెబుతున్నారు. సెలవుల్లో ఊర్లకు వెళ్తే ఇంటికి తాళాలు వేసి స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని, చిన్నారులను ఈతకు వెళ్లకుండా చూడాలని సూచిస్తున్నారు.
Similar News
News April 22, 2025
ఇన్‌స్టాలో RCB మరో మైలురాయి

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాలో ఆర్సీబీ ఫ్రాంచైజీ మరో మైలురాయి చేరుకుంది. అత్యధిక ఫాలోవర్లు కలిగిన తొలి ఐపీఎల్ జట్టుగా నిలిచింది. ప్రస్తుతం ఈ టీమ్‌కు 19 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆ తర్వాత CSK (18.3M), MI(17M), KKR(7.3M), SRH (5.4M), RR(4.9M), GT (4.7M), DC (4.5M), PBKS(4M), LSG (3.6M) ఉన్నాయి.
News April 22, 2025
మెదక్: ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలదే హవా.!

మెదక్ జిల్లాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో విద్యార్థులు 49.21% ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 6,153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 3,028 పాస్ అయ్యారు. 3125 మంది ఫెయిల్ అయ్యారు. ఇందులో బాలుర ఉత్తీర్ణత శాతం 39.09 % కాగా, బాలికలు 57.05 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు పైచేయి సాధించడంతో జిల్లా ప్రజలు అభినందనలు తెలుపుతున్నారు.
News April 22, 2025
నకిలీ పోలీసుల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సాధారణ దుస్తులు ధరించి పోలీసుల పేరు చెప్పి ఎవరైనా వాహనాలు తనిఖీలు చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లయితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ఎస్పీ నరసింహ సూచించారు. పోలీసు సిబ్బంది ఎవరు కూడా సివిల్ డ్రెస్‌లో వాహనాలు తనిఖీ చేయరని అన్నారు. పోలీసు సిబ్బంది ఎల్లప్పుడూ ఖాకీ యూనిఫామ్ ధరించి వాహనాల తనిఖీలు చేస్తారని తెలిపారు. సివిల్ డ్రెస్‌లో తనిఖీ నిర్వహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.