News April 15, 2025

వరంగల్: వేసవి సెలవులు.. ఓ కన్నేసి ఉంచండి!

image

ఈనెల 24 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. అయితే సెలవుల్లో పిల్లలు చెరువులు, బావుల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని తల్లిదండ్రులకు అధికారులు సూచిస్తున్నారు. వారిపై ఓ కన్నేసి ఉంచాలని చెబుతున్నారు. స్నేహితులతో దూర ప్రాంతాలకు పంపవద్దని, బైకులు ఇవ్వొద్దని, ఫోన్ వాడకుండా చూడాలని అంటున్నారు. కాగా, BHPL జిల్లాలో సెలవుల్లో ప్రమాదాల బారినపడి పిల్లలు మరణించిన సందర్భాలూ ఉన్నాయి.

Similar News

News April 19, 2025

కామారెడ్డి: ఏపీ మంత్రిని కలిసిన ప్రభుత్వ సలహాదారు

image

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శనివారం హైదరాబాద్‌లోని హాజ్ హౌస్‌లో ఆంధ్రప్రదేశ్ మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి ఫరూక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హజ్ యాత్రకు వెళ్లే ఇరు రాష్ట్రాల యాత్రికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై ఇరువురు చర్చించారు. అంతకుముందు మంత్రిని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ శాలువా కప్పి సత్కరించారు.

News April 19, 2025

కామారెడ్డి: కఠిన శిక్షలు పడితేనే నేరాలు తగ్గుతాయి: SP

image

నేరాలకు పాల్పడే వారికి కఠినమైన శిక్షలు పడినప్పుడే నేరాల సంఖ్య తగ్గుతుందని KMR జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం నిర్వహించిన కోర్టు డ్యూటీ పోలీసు అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు డ్యూటీ అధికారులు నిబద్ధతతో పని చేయాలని సూచించారు. వారెంట్లు, సమన్లు వేగంగా ఎగ్జిక్యూట్ చేసి ట్రయల్ సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.

News April 19, 2025

నిర్మల్‌లో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత

image

నిర్మల్ జిల్లాలో శనివారం 42.7డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఓవైపు ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతుంటే మరోవైపు అనుకోని అకాల వర్షాలు కురుస్తున్నాయన్నారు. జిల్లాలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆదివారం 42.5, సోమవారం 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

error: Content is protected !!