News February 2, 2025
వరంగల్: వ్యక్తి ఆత్మహత్య.. విచారిస్తున్న పోలీసులు

ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. ఉర్సు బొడ్రాయి ప్రాంతంలో వంగాల రాజేందర్(45) అతని భార్యతో ఓ ఇంట్లో కిరాయి ఉంటున్నాడు. భార్య ఇంట్లో లేని సమయంలో రాజేందర్ ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. సమాచారాన్ని తెలుసుకున్న స్థానిక మిల్స్ కాలనీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News December 4, 2025
NRPT: భయాందోళనకు గురిచేసేందుకే క్షుద్రపూజలు

కోస్గి మండలంలోని మీర్జాపూర్ ఉన్నత పాఠశాలలో క్షుద్రపూజలు విద్యార్థులను భయాందోళన గురి చేసే అందుకే చేసి ఉంటారని పాఠశాల హెచ్ఎం జనార్దన్ రెడ్డి తెలిపారు. ఇట్టి పూజలు చేసిన ఆకతాయిలకు పోలీసులు గుణపాఠం చెప్తారన్నారు. విద్యార్థులకు ధైర్యం చెప్పి పాఠశాలను కొనసాగించినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
News December 4, 2025
ఖమ్మం: ఎన్నికల్లో తల్లీకూతుళ్ల సమరం..!

ఖమ్మం జిల్లా: పెనుబల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అరుదైన పోరు నెలకొంది. సర్పంచ్ పదవి కోసం తల్లి తేజావత్ సామ్రాజ్యం, కూతురు బానోతు పాప ప్రత్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. సొంత కుటుంబ సభ్యులే ఒకే పదవికి పోటీ పడుతుండటంతో ఈ ఎన్నిక రసవత్తరంగా మారింది. ఈ ఆసక్తికరమైన పోరాటం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, విజయం ఎవరిని వరిస్తుందోనని స్థానికులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
News December 4, 2025
వనపర్తి: 45 సర్పంచ్ నామినేషన్లు దాఖలు..!

వనపర్తి జిల్లాలో మూడో విడతలో జరగనున్న 87 గ్రామ పంచాయతీలకు బుధవారం మొత్తం 45 మంది సర్పంచ్ అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారు. మండలాల వారీగా నామినేషన్లు ఇలా ఉన్నాయి..
✓ చిన్నంబావిలోని 17 GPలకు – 9 నామినేషన్లు.
✓ పానగల్లోని 28 GPలకు – 15 నామినేషన్లు.
✓ పెబ్బేరులోని 20 GPలకు – 13 నామినేషన్లు.
✓ శ్రీరంగాపూర్లోని 8 GPలకు – 6 నామినేషన్లు.
✓ వీపనగండ్లలోని 14 GPలకు – 2 నామినేషన్లు దాఖలయ్యాయి.


