News April 3, 2025

వరంగల్: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

image

హనుమకొండ పోస్టల్ కాలనీలో హైటెక్ వ్యభిచారం చేస్తున్న ఇంటిపై సుబేదారి పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఇతర రాష్ట్రాలు నుంచి మహిళలను రప్పించి వ్యభిచారం చేస్తున్నారని పోలీసుల తెలిపారు. ఇందులో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5 సెల్ ఫోన్స్, రూ.2,450 నగదు స్వాధీనపరచుకున్నామని ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

Similar News

News April 11, 2025

WGL: చిరుదాన్యాల ధరల వివరాలు….

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో నేడు (శుక్రవారం) చిరుధాన్యాల ధరలు ఇలా ఉన్నాయి. సూక పల్లికాయ క్వింటా ధర రూ.6,200, పచ్చి పల్లికాయ రూ.4,250 పలికింది. అలాగే పసుపు (కాడి) క్వింటా ధర రూ.13,659, పసుపు (గోల)కి రూ.12,689 వచ్చింది. మరోవైపు మక్కలు (బిల్టీ) క్వింటా ధర రూ.2,320 పలికినట్లు అధికారులు వెల్లడించారు. కాగా మక్కల ధర 2 రోజులతో పోలిస్తే పెరిగింది.

News April 11, 2025

వరంగల్: మైనర్లకు పోలీసుల కౌన్సిలింగ్

image

జనగామ జిల్లా పాలకుర్తిలోని గుడివాడ చౌరస్తాలో నలుగురు మైనర్లు ఒకే బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎస్సై యాకూబ్ హుస్సేన్ వారిని అదుపులోకి తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని హెచ్చరించారు. పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

News April 11, 2025

ప్రపంచ దేశాల సుందరీమణుల పర్యటనకు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

మే 14న హైదరాబాద్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరీమణులు వరంగల్ పర్యటనలో భాగంగా కాళోజీ కళాక్షేత్రం సందర్శించనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. చరిత్ర గల వరంగల్‌ను ప్రపంచ దేశాల సుందరీమణులు సందర్శించేందుకు దక్కిన అరుదైన గౌరవం అని తెలిపారు.

error: Content is protected !!