News February 25, 2025
వరంగల్: శైవ క్షేత్రాలకు నేటి నుంచి స్పెషల్ బస్సులు

మహా శివరాత్రి సందర్భంగా ప్రయాణికుల కోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. నేటి నుంచి ఈనెల 27వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్-1, వరంగల్-2, భూపాలపల్లి, జనగామ, మహబూబాబాద్, తొర్రూరు, పరకాల, హనుమకొండ డిపోల నుంచి 255 బస్సులను నడపనున్నారు. ఆయా డిపోల నుంచి కాళేశ్వరం, పాలకుర్తి, కురవి, కొమురవెల్లి, రామప్ప, మెట్టుగుట్టకు నడిపెంచేలా ఏర్పాట్లు చేశారు.
Similar News
News March 27, 2025
విశాఖలో కేజీ మామిడికాయల రేటు ఎంతంటే?

విశాఖలోని 13 రైతుబజార్లలో గురువారం నాటి కూరగాయ ధరలను అధికారులు విడుదల చేశారు.(రూ/కేజీలలో) టమటా రూ.15, ఉల్లిపాయలు రూ.23, బంగాళా దుంపలు రూ.16, వంగ రూ.26/32, బెండ రూ.30, బీర రూ.42, మిర్చి రూ.26, క్యారెట్ రూ.28, దొండకాయ రూ.24, బరబాట రూ.22, పొటాల్స్ రూ.54, కీర రూ.22, గ్రీన్ పీస్ రూ.54, మామిడికాయలు రూ.42, బద్ధ చిక్కుడు రూ.56, చీమదుంప రూ.30, కాకర రూ.32, బీట్ రూట్ రూ.24, క్యాప్సికమ్ రూ.38గా నిర్ణయించారు.
News March 27, 2025
VKB: జిల్లా వాసికి అత్యున్నతమైన సోషల్ సర్వీస్ అవార్డ్

సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను అత్యున్నతమైన డాక్టరేట్ ఆఫ్ సోషల్ సర్వీస్ పురస్కారం అందుకోవడం సంతోషాన్ని కలిగించిందని జిల్లా వాసి జాటోత్ రవి నాయక్ అన్నారు. ఈ మేరకు ఢిల్లీలోని హానరరీ డాక్టరేట్ అవార్డు కౌన్సిల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో ఆయనకు ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురి ప్రశంసలు వెలువెత్తాయి.
News March 27, 2025
ప్రకాశం జిల్లాలో టెన్షన్.. టెన్షన్

ప్రకాశం జిల్లాలో మరికాసేపట్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కోఆప్షన్ పదవులకు ఉప ఎన్నిక జరగనుంది. వైసీపీకి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ.. ఆ పార్టీకి షాక్ ఇవ్వడానికి కూటమి నాయకులు ప్లాన్ చేశారని సమాచారం. త్రిపురాంతకం వైసీపీ ఎంపీపీ అభ్యర్థి ఆళ్ల ఆంజనేయరెడ్డి జైల్లో ఉన్నారు. మరి అక్కడ ఆయన గెలుస్తారా? లేదా? అనేది ఆసక్తి రేపుతోంది. నిన్న రాత్రి నుంచే పోలీసులు అప్రమత్తంగా ఉంటూ 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.