News March 16, 2025

వరంగల్ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన కరీంనగర్ సీపీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన సన్ ప్రీత్ సింగ్‌ను కరీంనగర్ వరంగల్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. అనంతరం ఇరువురు అధికారులు శాంతి భద్రతలకు సంబంధించి పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. గౌస్ ఆలం ఇటీవల కరీంనగర్ నూతన సీపీ బాధ్యతలు చేపట్టారు.

Similar News

News March 17, 2025

సంగారెడ్డి: జిల్లాకు చేరుకున్న పదో తరగతి ప్రశ్నా పత్రాలు

image

జిల్లాలో ఈ నెల 21 నుంచి నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నా పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రశ్నా పత్రాలను రూట్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ మండల పోలీస్ స్టేషన్ లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

News March 17, 2025

ఈ రోజు నమాజ్ వేళలు

image

మార్చి 17, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5.11 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.23 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.24 గంటలకు
అసర్: సాయంత్రం 4.45 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.26 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News March 17, 2025

నిర్మల్ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త

image

నిర్మల్ ఆర్టీసీ డిపో నుంచి ఖానాపూర్, మెట్పల్లి, ఆర్మూర్ మీదుగా శంషాబాద్ ఏయిర్ పోర్ట్‌కు బస్సు సౌకర్యం కల్పిస్తున్నట్లు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఖానాపూర్ బస్ స్టేషన్ నుంచి సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి రాత్రి 11.55 గంటలకు శంషాబాద్‌కు చేరుకుంటుందన్నారు. తిరిగి ఉదయం 7గంటలకు శంషాబాద్ నుంచి నిర్మల్‌కు బయల్దేరుతుందని వెల్లడించారు.

error: Content is protected !!