News April 2, 2025

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

image

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM రోగులకు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News November 25, 2025

NGKL: ప్రజావాణిలో 14 ఫిర్యాదులు: ఎస్పీ

image

నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ డాక్టర్ పాటిల్ సంగ్రామ్ జీ సింగ్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను ప్రత్యక్షంగా విన్నారు. మొత్తం 14 ఫిర్యాదులను స్వీకరించగా, వాటిలో 11 భూమి సంబంధిత అర్జీలు ఉన్నాయి. చట్ట ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆయన సంబంధిత అధికారులకు సూచించారు.

జగిత్యాల కార్ ఓనర్స్ & డ్రైవర్స్ జిల్లా అధ్యక్షుడిగా వెంకటేష్

image

జగిత్యాల జిల్లా కేంద్రంలో కారు ఓనర్స్ & డ్రైవర్స్ జిల్లా సమావేశం నిర్వహించి కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా సురుగు వెంకటేష్, ఉపాధ్యక్షుడిగా దాది రఘుపతి, కార్యదర్శిగా దండే రమేష్, అదనపు కార్యదర్శిగా మాలి కిషన్, కోశాధికారిగా మధురవేణి మహేష్, ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వెంకటేష్ మాట్లాడుతూ.. డ్రైవర్ల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తూ వారికి అండగా ఉంటానని తెలిపారు.