News April 2, 2025

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

image

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM రోగులకు సరిపోకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News December 2, 2025

ఈ ఆపిల్ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది

image

సాధారణ ఆపిల్స్‌ను ఫ్రిజ్‌లో ఉంచితే కొన్ని రోజులకే రుచి మారిపోతాయి. అయితే ‘కాస్మిక్ క్రిస్ప్’ అనే ఆపిల్ మాత్రం చల్లని ఉష్ణోగ్రత వద్ద కొన్ని నెలల పాటు నిల్వ ఉంటుంది. రుచి మారదు. అలాగే దీన్ని కోసిన తర్వాత కూడా ముక్కలు చాలా సేపటి తర్వాతే గోధుమ రంగులోకి మారతాయి. వాషింగ్టన్ స్టేట్ వర్శిటీ 20 ఏళ్ల పాటు పరిశోధనలు చేసి దీన్ని రూపొందించింది. ఇది ఎరుపు రంగులో తీపి, పులుపుగా, ముక్కకాస్త దృఢంగా ఉంటుంది.

News December 2, 2025

ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

image

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

News December 2, 2025

మచిలీపట్నం లేదా పెడన నుంచి పోటీకి రెడీ..!

image

జనసేన నాయకుడు కొరియర్ శ్రీను టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఆదేశిస్తే తాను మచిలీపట్నం లేదా పెడన నుంచి ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని ఆయన ప్రకటించారు. దీంతో రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ ప్రాంతాల్లో టికెట్ సమీకరణపై ప్రభావం చూపుతుందనే చర్చ జనసేన వర్గాల్లో నడుస్తోంది.