News April 2, 2025

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

image

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM సరిపోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Similar News

News December 7, 2025

డిసెంబర్ 07: చరిత్రలో ఈ రోజు

image

1792: భారత్‌లో పోలీసు వ్యవస్థను ప్రవేశపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ
1896: తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు కన్నెగంటి సూర్యనారాయణమూర్తి జననం
1975: డైరెక్టర్ సురేందర్ రెడ్డి జననం
2013: హాస్యనటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం(ఫొటోలో) మరణం
*భారత సాయుధ దళాల పతాక దినోత్సవం
*అంతర్జాతీయ పౌర విమానయాన దినోత్సవం

News December 7, 2025

LRS, BPS GVMC టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు

image

LRS, BPS సంబంధిత సేవలకు GVMC టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు GVMC చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు శనివారం తెలిపారు. BPS ద్వారా అనుమతి లేని, డీవియేషన్ ఉన్న భవనాలకు రెగ్యులరైజేషన్ దరఖాస్తుల ప్రక్రియను 2026 జనవరి 23 వరకు పొడిగించామన్నారు. ప్రజలకు మార్గదర్శకత్వం కోసం హెల్ప్ డెస్క్ నంబర్లు 91542 82649, 91542 82654 అందుబాటులో ఉన్నాయన్నారు.

News December 7, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.