News April 2, 2025
వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పూర్తి చేయండి సారూ!

ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న MGM సరిపోకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో రూ.1,116 కోట్లతో నగరంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నిర్మాణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలస్యం చేస్తుందని ఆరోపిస్తున్నారు. కాగా, మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Similar News
News February 25, 2026
ప్రమాద బాధితులకు పీఎం రాహత్ పథకం: కలెక్టర్

రోడ్డు ప్రమాద బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం రాహత్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిందని కలెక్టర్ రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం జిల్లా రవాణా శాఖ, మున్సిపల్, రోడ్డు భవనాలు, పోలీసు, పంచాయతీ శాఖ అధికారులతో పీఎం రాహత్ పథకంపై ఆమె సమీక్షించారు. ప్రమాదం జరిగిన 7 రోజుల్లోనే ఒక్కొక్కరికి గరిష్ఠంగా రూ.1.50 లక్షల నగదు రహిత వైద్య చికిత్స అందించనున్నారన్నారు. ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
News February 25, 2026
మోదీ ఇజ్రాయెల్ ట్రిప్‌పై రాహుల్ విమర్శలు

ప్రధాని మోదీ ఇజ్రాయెల్ పర్యటనపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. USతో ట్రేడ్ డీల్ క్యాన్సిల్ చేసుకోమని తాను సవాల్ విసిరి 24 గంటలకుపైనే అయిందని.. దీనిపై స్పందించకుండా సైలెంట్‌గా మోదీ ఇజ్రాయెల్ వెళ్లిపోయారని విమర్శించారు. గతంలో ఓసారి ఎప్‌స్టీన్ ఆదేశాలతో ఇజ్రాయెల్‌లో పర్యటించారని.. ఇప్పుడు ఎవరి ఆదేశాలతో మళ్లీ వెళ్లారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా నరేంద్ర ‘సరెండర్’ మోదీ అంటూ PMని విమర్శించారు.
News February 25, 2026
మహబూబాబాద్ బస్టాండ్‌లో భారీ చోరి

మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టాండ్‌లో భారీ చోరీ జరిగింది. బస్సు కోసం వేచి చూస్తున్న ప్రయాణికుడి ప్యాంట్ జేబులో నుంచి రూ.7 లక్షల విలువైన 41/2 తులాల బంగారు, 3 తులాల వెండి ఆభరణాలు గల బ్యాగును దుండగులు అపహరించారని బాధితులు వాపోయారు. మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామానికి చెందిన గండి శోభన్-మంజుల దంపతులు మహబూబాబాద్ ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు కోసం వేచి చూస్తుండగా దొంగలు దోచుకుపోయారు.


