News March 19, 2025

వరంగల్: సెల్ ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు!

image

సెల్‌ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు చేసిన ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మండల కేంద్రంలో ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి మరణించాడు. సమయం దాదాపు రాత్రి 7 గంటలు కావడంతో సెల్‌ఫోన్ లైట్లతో దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో అక్కడ ఎలాంటి విద్యుత్ ఏర్పాట్లు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో స్నానాలు చేస్తుండగా అనుకోని ప్రమాదం జరిగితే బాధ్యులెవరని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Similar News

News November 15, 2025

నర్సంపేట నుంచి అన్నవరానికి సూపర్ లగ్జరీ బస్సు

image

నర్సంపేట RTC డిపో టూర్ ప్యాకేజీలో భాగంగా నర్సంపేట నుంచి 36 సీట్లు గల సూపర్ లగ్జరీ బస్సును ఈరోజు డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మీ ప్రారంభించారు. ఈ యాత్ర ద్వారక తిరుమల, పిఠాపురం, అన్నవరం, సింహాచలం, విశాఖపట్నం ఆర్కే బీచ్, అంతర్వేది, యానాం మీదుగా ఈనెల 18న రాత్రి 9 గం. వరకు నర్సంపేట చేరుకుంటుందన్నారు. ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు.

News November 15, 2025

సూర్యాపేట: కారు బీభత్సం.. ముగ్గురికి గాయాలు (UPDATE)

image

సూర్యాపేట-జనగామ హైవేపై నాగారం బంగ్లా సమీపంలో ఓ కారు బీభత్సం సృష్టించింది. పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు కానిస్టేబుల్‌ను ఢీ కొట్టింది. అనంతరం మరో బైక్‌ను ఢీ కొట్టడంతో మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ కారును స్పాట్‌లోనే వదిలిపెట్టి పరారయ్యాడు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

News November 15, 2025

సూర్యాపేట: కానిస్టేబుల్‌ను ఢీకొట్టిన కారు

image

సూర్యాపేట(D) తిరుమలగిరి(M) నాగారంలో సూర్యాపేట-జనగామ హైవేపై పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా జనగామ నుంచి సూర్యాపేట వెళ్తున్న కారు అతివేగంగా పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ఘటనలో కానిస్టేబుల్‌ కమలాకర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉంది. తరువాత అటుగా వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో బైక్‌పై ఉన్న ఇద్దరూ గాయపడ్డారు.