News March 29, 2025
వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్లోని సైనిక్ స్కూల్కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.
Similar News
News October 18, 2025
PM జన్మన్ అమలులో TGకి మూడో ర్యాంక్

ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్(PM JANMAN) అమలులో తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో మూడో ర్యాంక్ సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన ‘ఆది కర్మయోగి అభియాన్’ జాతీయ సదస్సులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. గిరిజన సమూహాల సమాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగు పరిచేందుకు కేంద్రం 2023 నవంబర్లో ఈ పథకం ప్రారంభించింది.
News October 18, 2025
నేడు ఇలా చేస్తే సకల శుభాలు

నేడు ధన త్రయోదశి పర్వదినం. ఈరోజున ధన్వంతరి, లక్ష్మీదేవి, కుబేరుడు, వినాయకుడిని భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు. ‘ఈ శుభ దినాన బంగారం, వెండి, లోహ పాత్రలు, కొత్తిమీర, కొత్త చీపురు కొనడం శుభప్రదం. ప్రధాన ద్వారం వద్ద యముడికి దీపాన్ని దానం చేయడం ద్వారా అకాల మృత్యు భయం తొలగుతుంది. తెల్లని వస్తువులు దానం చేస్తే లక్ష్మీ, కుబేరుల అనుగ్రహం లభించి, సంపద వర్షిస్తుంది’ అని పేర్కొంటున్నారు.
News October 18, 2025
నేడు ఉద్యోగ సంఘాలతో చర్చలు

AP: నేడు సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో కీలక చర్చలు జరగనున్నాయి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో మంత్రుల బృందం వారితో సమావేశంకానుంది. పీఆర్సీ అమలు, డీఏ బకాయిలు, జీపీఎఫ్, పీఎఫ్ సమస్యలు, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సంబంధిత సమస్యలపై చర్చించనున్నారు. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, సీఎస్ విజయానంద్ ఈ భేటీలో పాల్గొంటారు.