News March 29, 2025
వరంగల్: సైనిక్ స్కూల్ విద్యార్థులకు అగ్నివీర్ ఉద్యోగాలు

వరంగల్ జిల్లా ఖానాపురం మండలం అశోక్ నగర్‌లోని సైనిక్ స్కూల్‌కు చెందిన 8 మంది డిగ్రీ విద్యార్థులు అగ్నివీర్(ఇండియన్ ఆర్మీ)లో ఉద్యోగాలు సాధించారు. పాఠశాలకు చెందిన ఈశ్వర్, ఆకాష్, అంజి, ఆనంద్, సాయికుమార్, రాజేందర్, అభిలాష్, శ్రావణ్ ఉద్యోగాలు సాధించిన వారిలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన 8 మంది విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ సురేందర్ అభినందించారు.
Similar News
News April 18, 2025
మే నుంచి ‘రామాయణ’ పార్ట్-2 షూటింగ్?

రణ్‌బీర్ కపూర్, సాయిపల్లవి సీతారాములుగా నటిస్తున్న ‘రామాయణ’ సినిమా పార్ట్-1 షూటింగ్ దాదాపుగా పూర్తయింది. పార్ట్-2 షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఈ షెడ్యూల్‌లో అశోక వాటిక సీన్లు, రెండు పాటలతో పాటు పలు కీలక సీన్లు చిత్రీకరిస్తారని సమాచారం. రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాను నితేశ్ తివారీ డైరెక్ట్ చేస్తున్నారు. రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీడియోల్ నటిస్తున్నారు.
News April 18, 2025
VIJ: తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.
News April 18, 2025
ఏఐకేఎస్ జాతీయ కార్యవర్గంలో ముగ్గురికి స్థానం

ఏఐకేఎంఎస్ జాతీయ సమితిలో ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురికి స్థానం లభించింది. తమిళనాడులో ముగిసిన జాతీయ మహాసభల్లో 36 మందితో జాతీయ కార్యవర్గం, 115 మందితో జాతీయ కౌన్సిల్‌ను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నేలకొండపల్లికి చెందిన బాగం హేమంతరావు జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు. చింతకాని మండలం రాఘవాపురానికి చెందిన కొండపర్తి గోవిందరావుతో పాటు మందడపు రాణికి జాతీయ కౌన్సిల్ సభ్యులుగా స్థానం దక్కింది.