News February 21, 2025
వరంగల్: సొంత భవనాలు నిర్మించాలని సీఎంకు విజ్ఞప్తి

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాల సొంత భవనాలు ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ట్విటర్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. అనంతరం విద్యార్థి నాయకులు నరేశ్ మాట్లాడుతూ.. ప్రతి నెల గురుకుల అద్దె భవనానికి రూ.3 లక్షలు ప్రభుత్వం చెల్లిస్తోందని, ప్రభుత్వం స్పందించి సొంత భవనాలు ఏర్పాటు చేయాలని కోరారు.
Similar News
News March 24, 2025
ఎల్లనూరు మండలంలో 971 ఎకరాలలో పంట నష్టం

ఎల్లనూరు మండల వ్యాప్తంగా అకాల వర్షం కారణంగా 971 ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు హార్టికల్చర్ అధికారులు అంచనా వేశారు. ఎమ్మెల్యే బండారు శ్రావణి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ సిబ్బందితో కలిసి పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. సుమారు 215 మంది రైతులు సాగు చేసిన 971 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నట్లు చెప్పారు.
News March 24, 2025
ములుగు: అటవీ ప్రాంతంలో మృతదేహం కలకలం

తాడ్వాయి మండలంలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపింది. తాడ్వాయి మేడారం మధ్య విండ్ ఫాల్ అడవి ప్రాంతంలో కుళ్లిన మృతదేహం లభ్యమైంది. ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మాట్లాడుతూ.. మేడారం మినీ జాతరకు కుటుంబ సభ్యులతో వచ్చి తప్పిపోయాడని, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మతిస్థిమితం లేని సదరు వ్యక్తి అడవిలో తిరుగుతూ ఆహారం, నీరు లేక చనిపోయి ఉండవచ్చన్నారు.
News March 24, 2025
MDK: ఆశా వర్కర్లను విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్

రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల అరెస్టులను బీఆర్ఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం వేతనాలు పెంచాలని డిమాండ్ చేయడమే వారు చేసిన నేరమా?, వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీసు స్టేషన్లకు తరలించడం దుర్మార్గం అని మండిపడ్డారు.