News February 28, 2025
వరంగల్: సోలార్ బ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన ఎస్ఐ

వరంగల్ జిల్లా నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో వివిధ గ్రామాల్లో సోలార్ లైట్కు సంబంధించిన 10 బ్యాటరీలను దొంగిలించి ఆటోలో వేసుకొని ములుగులో అమ్ముకునేందుకు వెళ్తుండగా నల్లబెల్లి పోలీస్ సిబ్బందితో పట్టుకున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. నిందితులను జుడీషియల్ రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 20, 2025
ఎన్టీఆర్: సీఆర్డిఏలో 2 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్, స్ట్రాటజీ & కమ్యూనికేషన్స్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 24లోపు https://crda.ap.gov.in/ అధికారిక వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని CRDA కమిషనర్ కె.కన్నబాబు సూచించారు. విద్యార్హతలు, దరఖాస్తు విధానం తదితర వివరాలకు పైన ఇచ్చిన వెబ్సైట్ చూడాలన్నారు.
News November 20, 2025
26న దేశవ్యాప్తంగా రైతుల నిరసనలు

రైతులు, కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 26న దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టనున్నట్లు సంయుక్త కిసాన్ మోర్చా(SKM) వెల్లడించింది. రైతుల ఢిల్లీ మార్చ్కు ఐదేళ్లు అవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ‘నాడు కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. MSP, రుణమాఫీ, విద్యుత్ ప్రైవేటీకరణ నిలుపుదల వంటి వాటిని పట్టించుకోలేదు’ అని ఆల్ ఇండియా కిసాన్ సభ అధ్యక్షుడు అశోక్ దవాలే మండిపడ్డారు.
News November 20, 2025
ఏపీ న్యూస్ అప్డేట్స్

*శ్రీకాకుళం(D) ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేసేందుకు ICMR ఆమోదం తెలిపింది. మూడేళ్లలో పరిశోధన పూర్తి చేసేందుకు రూ.6.2 కోట్లు ఇవ్వనుంది: మంత్రి సత్యకుమార్
*వైసీపీ పథకాన్ని చంద్రబాబు కాపీ కొట్టారు. జగన్ చేసిన మంచి పనులకు తన స్టాంప్ వేసుకుని క్రెడిట్ చోరీ చేయాలని ఆలోచిస్తున్నాడు: కన్నబాబు
*ఇవాళ బిహార్ CMగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారానికి వెళ్లనున్న CM చంద్రబాబు, మంత్రి లోకేశ్.


