News February 28, 2025
వరంగల్: సోలార్ బ్యాటరీ దొంగలను అరెస్టు చేసిన ఎస్ఐ

వరంగల్ జిల్లా నల్లబెల్లి, నర్సంపేట మండలాల్లో వివిధ గ్రామాల్లో సోలార్ లైట్‌కు సంబంధించిన 10 బ్యాటరీలను దొంగిలించి ఆటోలో వేసుకొని ములుగులో అమ్ముకునేందుకు వెళ్తుండగా నల్లబెల్లి పోలీస్ సిబ్బందితో పట్టుకున్నట్లు ఎస్సై గోవర్ధన్ తెలిపారు. నిందితులను జుడీషియల్ రిమాండ్ తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News March 26, 2025
పల్నాడు: మంత్రి పదవి రేసులో యరపతినేని.?

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో గురజాల MLA యరపతినేని శ్రీనివాసరావుకు ప్రాతినిధ్యం కల్పించాలని TDP కార్యకర్తలు బలంగా వాదన వినిపిస్తున్నారు. MLC నాగబాబుకు మంత్రి మండలిలో చోటు కల్పించేందుకు విస్తరణ చేపట్టనున్నారు. క్యాబినెట్‌లో పల్నాడుకు ప్రాతినిధ్యం లేదు. గురజాల నుంచి వరుసగా 7 సార్లు పోటీ చేసి TDPలో 3 తరాలతో పనిచేసిన యరపతినేనికి మంత్రి మండలిలో బెర్త్‌పై ప్రచారం జరుగుతోంది.
News March 26, 2025
మంగళగిరి: అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్

అఘోరి శిష్యురాలి వ్యవహారంలో ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ మేరకు మంగళవారం మంచిర్యాల జిల్లా నెన్నెల పోలీసు స్టేషన్‌లో శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. అఘోరితో కలిసివచ్చి శ్రీవర్షిణి ఫిర్యాదు చేసింది. తల్లిదండ్రులు, కేర్‌టేకర్ విష్ణుతో ప్రాణహాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. ఇష్ట పూర్వకంగానే అఘోరిగా మారినట్లు శ్రీవర్షిణి తెలిపింది.
News March 26, 2025
పార్వతీపురం నగరపాలక సంస్థ బకాయిదారులకు శుభవార్త

పార్వతీపురం మున్సిపాలిటీ పరిధిలో ఖాళీ స్థలం, ఇంటి స్థల పన్నులపై 50 శాతం వడ్డీ రాయితీని ఇస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. దీనిని వన్ టైం సెటిల్మెంట్‌గా భావించి ఏక మొత్తంలో చెల్లించి 50% రాయితీ పొందవచ్చును అన్నారు. ఈనెల 31 వరకు మాత్రమే ఈ అవకాశం ఉందన్నారు. సచివాలయాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో పన్నులు చెల్లించి తగు రసీదు పొందాలని సూచించారు.