News February 25, 2025
వరంగల్: స్పెషల్ బస్సుల టికెట్ ఛార్జీలు ఇలా..!

మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.
Similar News
News December 13, 2025
రేపు సూర్యపేట జిల్లాలో కేటీఆర్ పర్యటన

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. నూతనకల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ నాయకులు చేతిలో ఇటీవల హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు ఉప్పల మల్లయ్య కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మల్లయ్య కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
News December 13, 2025
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

<
News December 13, 2025
సైబర్ నేరగాళ్లపై కరీంనగర్ సీపీ ఉక్కుపాదం

టెక్నాలజీపై పట్టున్న కరీంనగర్ CP గౌస్ ఆలం ఆర్థిక నేరగాళ్లను వేటాడుతున్నారు. సైబర్ క్రైమ్ కంప్లైంట్ వచ్చిన వెంటనే కేసును చేధిస్తూ బాధితులలో భరోసా నింపుతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన మేటా ఫండ్ కింగ్ పిన్ లోకేశ్వర్ను పట్టుకొని కటకటాల్లోకి పంపారు. కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో 281 సైబర్ కేసులు నమోదయ్యాయి. రూ.90,77,918 రికవరీ చేసి బాధితులకు అందించారు.


