News February 25, 2025

వరంగల్: స్పెషల్ బస్సుల టికెట్ ఛార్జీలు ఇలా..!

image

మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.

Similar News

News February 25, 2025

విశాఖ: 123 పోలింగ్ కేంద్రాలు.. 22,493 మంది ఓటర్లు

image

ఉత్త‌రాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం చేసినట్లు ఎన్నికల అధికారి హరేంద్ర ప్రసాద్ తెలిపారు. 123 పోలింగ్ కేంద్రాలలో 22,493 మంది టీచర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారని వెల్లడించారు. శాంతి భ‌ద్ర‌త‌ల‌కు విఘాతం క‌ల‌గ‌కుండా 144 సెక్ష‌న్ విధిస్తామ‌న్నారు. ఎన్నిక‌ల‌ను స‌జావుగా నిర్వ‌హించేందుకు 739 మంది అధికారుల‌ను, సిబ్బందిని కేటాయించామ‌న్నారు. 148 మంది పీవోలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

News February 25, 2025

ఆస్ట్రేలియాvsసౌతాఫ్రికా మ్యాచ్ రద్దు

image

ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. పాయింట్స్ టేబుల్‌లో SA తొలి స్థానంలో, AUS రెండో స్థానంలో ఉన్నాయి. ఒకవేళ AFGపై AUS, ENGపై SA గెలిస్తే ENG, AFG ఎలిమినేట్ అవుతాయి. AUS, SA సెమీస్ చేరతాయి.

News February 25, 2025

Gold Rates: రికార్డు బ్రేక్ దిశగా పరుగులు..

image

బంగారం ధరలు జీవితకాల గరిష్ఠాన్ని చేరేందుకు తహతహలాడుతున్నాయి. నేడు మోస్తరుగా పెరిగాయి. 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.220 పెరిగి రూ.88,090 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.200 ఎగిసి రూ.80,750 వద్ద ఉంది. వెండి ధరల్లో మార్పులేదు. కిలో రూ.1,08,000 వద్ద ట్రేడవుతోంది. ట్రేడ్‌వార్స్ నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ $3000 టచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది.

error: Content is protected !!