News February 25, 2025
వరంగల్: స్పెషల్ బస్సుల టికెట్ ఛార్జీలు ఇలా..!

మహా శివరాత్రి సందర్భంగా మూడు రోజుల పాటు ఆయా బస్టాండ్ల నుంచి శైవ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. వరంగల్ నుంచి ఐనవోలుకు రూ.50, మెట్టుగుట్టకు రూ.50, హనుమకొండ నుంచి వేములవాడకు రూ.210, కాళేశ్వరానికి రూ.250, రామప్పకు రూ.140, పాలకుర్తికి రూ.90, తొర్రూరు నుంచి పాలకుర్తికి రూ.100, మహబూబాబాద్ నుంచి కురవికి రూ.30, జనగామ నుంచి కొమురవెల్లికి రూ.100 టికెట్ ధరలను తీసుకోనున్నారు.
Similar News
News February 25, 2025
వడ్డేపల్లి: పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం

వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె సమీపంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. అలంపూర్ మండలం క్యాతూరు గ్రామానికి చెందిన నరసింహ మంగళవారం పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. అటుగా వెళ్తున్న వారు గుర్తించి కర్నూలు ఆసుపత్రికి తరలించారు. నరసింహ లోన్ తీసుకొని తిరిగి చెల్లించే క్రమంలో సంబంధిత అధికారులతో గొడవపడి మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
News February 25, 2025
ఎమ్మెల్యేల కోసం అసెంబ్లీలో రిక్లైనర్లు.. కారణమిదే!

కర్ణాటక అసెంబ్లీ లాబీలో MLAలు రెస్ట్ తీసుకునేందుకు రిక్లైనర్లను ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ఖాదర్ వెల్లడించారు. లంచ్ తర్వాత రెస్ట్ కోసం MLAలు సభకు గైర్హాజరవుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. వీటి ఏర్పాటు వల్ల వారికి కాస్త విశ్రాంతి దొరికి ఫ్రెష్గా ఉంటారని, హాజరు కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. MAR 3-21 వరకు సమావేశాలు జరగనుండగా, 15 రిక్లైనర్లను అద్దెకు తీసుకుంటామని స్పీకర్ పేర్కొన్నారు.
News February 25, 2025
HYD: జూ పార్క్లో టికెట్ ధరలు పెంపు

HYD బహదూర్పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చిన్నారులకు రూ. 50, పెద్దలకు రూ. 100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. పార్క్ లోపల సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ ఆక్వేరియం వెళ్లే ధరలు కూడా పెరిగాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని క్యూరేటర్ స్పష్టం చేశారు.