News February 20, 2025

వరంగల్: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,400 పలకగా.. నేడు రూ.13,600కి పెరిగింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.16,100 ధర రాగా.. ఈరోజు రూ. 16,300 కి పెరిగింది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.13,300 ధర వచ్చింది.

Similar News

News December 8, 2025

ADB: బాండు పేపర్లు.. విచిత్ర హామీలు

image

పంచాయతీ ఎన్నికల్లో గెలవాలనుకున్న సర్పంచ్, వార్డు మెంబర్ల అభ్యర్థులు అలవికాని హామీలు ఇస్తున్నారు. తాజాగా నార్నూర్ మండలంలో బాండు పేపర్ రాసిచ్చిన ఘటన చోటు చేసుకుంది. ఇలాగే పలువురు గ్రామానికి ఫలానా పని చేసి ఇస్తాం.. మీ కులం వారికి భవనం కట్టిస్తాం.. మీ కులం వారికి వంట సామగ్రి పంపిణీ చేస్తాం అంటూ హామీలు ఇస్తున్నారు. ఆలయాభివృద్ధికి తోడ్పాటునందిస్తాం.. వీడీసీలకు నగదు ఇస్తామంటూ ఓట్లు అడుగుతున్నారు.

News December 8, 2025

సూర్యాపేట: ఎన్నికలు కలిపాయి వారిని..!

image

మొన్నటి వరకు ఒకరిపై ఒకరు మాటాల తూటాలు పేల్చుకున్న వివిధ పార్టీల నాయకులు నేడు ఒక్కటయ్యారు. వైరం మరిచి తమ పార్టీ బలపరిచిన నాయకుల గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. తుంగతుర్తి, వెలుగుపల్లిలో బీఆర్ఎస్, బీజేపీ కలిసి కొట్లాడుతున్నాయి. ఆత్మకూరు(S)లో కాంగ్రెస్, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఏపూరులో బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం పొత్తు పెట్టుకోగా.. కందగట్లలో బీజేపీ, బీఆర్ఎస్ కలిసి ఫైట్ చేస్తున్నాయి.

News December 8, 2025

కామారెడ్డి జిల్లాలో అత్యల్ప ఉష్ణోగ్రత 8.2°C

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. ఆరెంజ్ అలెర్ట్ జారీ అయిన ప్రదేశాల్లో నస్రుల్లాబాద్ 8.2°C, బొమ్మన్ దేవిపల్లి 8.3, డోంగ్లి 8.4, బీబీపేట 8.6, బీర్కూర్ 8.7, సర్వాపూర్ 8.8, లచ్చపేట, జుక్కల్ 9, ఎల్పుగొండ, గాంధారి 9.3, పుల్కల్ 9.4, బిచ్కుంద 9.6, మాక్దూంపూర్ 9.9, పిట్లం 10°C అత్యంత ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.