News February 20, 2025
వరంగల్: స్వల్పంగా పెరిగిన మిర్చి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో నిన్నటితో పోలిస్తే నేడు మిర్చి ధరలు స్వల్పంగా పెరిగాయి. క్వింటా తేజ మిర్చి ధర బుధవారం రూ.13,400 పలకగా.. నేడు రూ.13,600కి పెరిగింది. అలాగే వండర్ హాట్ (WH) మిర్చి నిన్న రూ.16,100 ధర రాగా.. ఈరోజు రూ. 16,300 కి పెరిగింది. మరోవైపు 341 రకం మిర్చికి నిన్నటిలాగే ఈరోజు కూడా రూ.13,300 ధర వచ్చింది.
Similar News
News March 15, 2025
గ్రహాంతరవాసులపై షాకింగ్ విషయాలు

గ్రహాంతరవాసులున్నారా అన్న ప్రశ్నకు అమెరికా మాజీ నిఘా, సైనికాధికారులు ‘ది ఏజ్ ఆఫ్ డిస్‌క్లోజర్’ అనే డాక్యుమెంటరీలో సంచలన విషయాలు వెల్లడించారు. ‘1940ల నాటి నుంచీ గ్రహాంతరవాసులు గుర్తుతెలియని ఎగిరే వాహనాల్లో(UAP) భూమిపైకి వస్తున్నారు. మన సాంకేతిక పురోగతిని పరిశీలిస్తున్నారు. వారు వచ్చే వాహనాలు గంటకు 50వేల కి.మీ పైగా వేగంతో ప్రయాణిస్తున్నాయి. వాటిని మానవమాత్రులు తయారుచేయలేరు’ అని స్పష్టం చేశారు.
News March 15, 2025
విశాఖలో 17 మంది పోలీసులకు బదిలీ

విశాఖ కమీషనరేట్ పరిధిలో 17 మంది సివిల్ పోలీస్ సిబ్బందిని శనివారం విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి బదిలీలు చేశారు. వీరిలో ఒక ఏఎస్ఐ, 8 మంది హెడ్ కానిస్టేబుల్స్, ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్, ఆరుగురు పోలీస్ కానిస్టేబుళ్లు ఉన్నారు. బదిలీ జరిగిన పోలీస్ స్టేషన్‌లలో తక్షణమే విధులలో చేరాలని ఉత్తర్వులలో పేర్కొన్నారు.
News March 15, 2025
బాదేపల్లి వ్యవసాయ మార్కెట్‌లో నేటి ధరలు

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు శనివారం 66 మంది రైతులు తమ పంట ఉత్పత్తులను అమ్మడానికి తీసుకువచ్చారు. వేరుశనగలు 392 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,871, కనిష్ఠ ధర రూ.5,869, లభించింది. మొక్కజొన్న 596 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.2,321, కనిష్ఠ ధర రూ.2,127గా ఉంది. ఆముదాలు15 క్వింటాలు రాగా గరిష్ఠ ధర రూ.6,125, కనిష్ఠ ధర రూ.6,060 లభించింది.