News April 5, 2025
వరంగల్, హన్మకొండ జిల్లాల్లో పడిపోతున్న భూగర్భ జలాలు

వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భూగర్భ జలాలు పడిపోతున్నాయి. అక్టోబర్ తర్వాత వర్షాలు లేకపోవడం, యాసంగి పనులు మొదలు పెట్టడంతో నీటి వినియోగం పెరిగింది. దీంతో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. HNK జిల్లాలో ఫిబ్రవరిలో 6.30 మీటర్ల లోతుకు నీరు పడిపోగా.. మార్చి చివరి నాటికి 7.16 మీటర్ల లోతుకు పడిపోయింది. WGL జిల్లాలో డిసెంబర్‌లో 4.18కు పడిపోగా.. మార్చి చివరి నాటికి 6.32 మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి.
Similar News
News February 25, 2026
T20 WC: పాక్ సెమీస్ చేరాలంటే..

T20 WCలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన పాక్‌కు సెమీస్ చేరడానికి రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది శ్రీలంకపై పాక్ కచ్చితంగా గెలవాలి. అదే సమయంలో న్యూజిలాండ్‌ను శ్రీలంక, ఇంగ్లాండ్ ఓడించాలి. అప్పుడు పాక్ మూడు పాయింట్లతో సెమీస్ చేరుతుంది. ఇక రెండోది న్యూజిలాండ్ తన మిగిలిన రెండు మ్యాచ్‌లలో ఒక్కటే గెలిస్తే శ్రీలంకపై పాక్ భారీ తేడాతో గెలిచి కివీస్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ సాధించాలి.
News February 25, 2026
జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా జర్మనీలో ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక తెలిపారు. ఐటీఐ విద్యార్హతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న 19-30 ఏళ్ల యువకులు దీనికి అర్హులు అని అన్నారు. ఈనెల 27వ తేదీన హనుమకొండలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జరిగే అవగాహన సదస్సుకు హాజరై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆమె కోరారు.
News February 25, 2026
రష్యా-ఉక్రెయిన్ ‘కాల్పుల విరమణ’పై ఓటింగ్‌కు భారత్ దూరం

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు పూర్తైన వేళ కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలపగా, భారత్, చైనా సహా 51 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతిని నెలకొల్పాలని, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని ఈ తీర్మానం కోరింది.


