News June 14, 2024

వరంగల్: 130 సార్లు రక్తదానం చేసి రికార్డు

image

వరంగల్ నగరానికి చెందిన తోట రాజేశ్వరరావు రికార్డు స్థాయిలో రక్తదానం చేసి యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు 129 సార్లు రక్తదానం చేసిన ఆయన ఈరోజు 130వ సారి రక్తదానం చేశారు. తన 18వ ఏటా నుంచి సంవత్సరానికి 4 సార్లు (ప్రతి 3 నెలకోసారి) రక్తదానం చేస్తానని చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ DMHO వెంకటరమణ, KMC ప్రిన్సిపల్ మోహన్ దాస్ తదితరులు ఆయనను శాలువాతో సత్కరించి, అభినందనలు తెలిపారు.

Similar News

News October 12, 2025

వరంగల్: 97%తో రికార్డు స్థాయిలో పల్స్ పోలియో

image

నేటి ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమం వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరిగింది. మొత్తం 20,101 మంది పిల్లలకు లక్ష్యంగా, 19,546 మందికి పోలియో వ్యాక్సిన్ వేసి 97 శాతం రికార్డు సాధించామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.బి.సాంబశివరావు తెలిపారు. పిల్లలకు తల్లిదండ్రులు పోలియో చుక్కలు తప్పక వేయించాలన్నారు.

News October 12, 2025

పదో వసంతంలోకి వరంగల్ జిల్లా..!

image

వరంగల్ జిల్లా 2016 అక్టోబర్ 11న ఏర్పాటైంది. నిన్నటితో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న జిల్లా నేటి నుంచి పదో వసంతంలోకి అడుగు పెట్టింది. కాగా కొత్త జిల్లా ఏర్పాటైన తర్వాత అభివృద్ధి పనులు జరిగాయని కొందరు.. ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని మరికొందరు అంటున్నారు. గ్రామీణ రోడ్లు దారుణంగా ఉన్నాయని, ప్రభుత్వ భవనాలు, స్కూళ్లు, హాస్టళ్లు సరిగా లేవని చెబుతున్నారు. మీ జిల్లా అభివృద్ధి అయ్యిందా కామెంట్ చేయండి.

News October 12, 2025

WGL: బిల్లులు రాక.. మధ్యాహ్న భోజన నిర్వాహకుల ఇబ్బందులు

image

జిల్లాలో మధ్యాహ్న భోజన నిర్వాహకులకు 8 నెలలుగా కోడిగుడ్ల బిల్లులు అందడం లేదు. మొత్తం 344 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో 13,725 మంది విద్యార్థులు చదువుతుండగా వారికి ప్రతి రోజూ మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు భోజనం అందిస్తున్నారు. మధ్యాహ్న భోజన కార్మికులకు ప్రభుత్వం ప్రతి నెల రూ.3 వేల వేతనం చెల్లిస్తోంది. భోజనానికి బిల్లులను తరగతుల వారీగా, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా విడుదల చేస్తోంది.