News February 26, 2026
వరంగల్: 14వాహనాలు.. 35 టన్నుల ఇసుక సీజ్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇసుక అక్రమ రవాణాదారులపై పోలీసులు నిఘా ఉంచారు. 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక తరలిస్తున్న 14 వాహనాలు అధికారులు పట్టుకున్నారు. సుమారు 35 టన్నుల ఇసుకను స్వాధీనం చేసుకొని, 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
Similar News
News April 13, 2026
భూపాలపల్లి: ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఇంటర్ ఫలితాల్లో భూపాలపల్లి జిల్లాలో బాలికలు ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది కంటే ఈసారి ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం మెరుగుపడింది. 34 కళాశాలల్లోని ఫస్ట్ ఇయర్‌లో 1734 విద్యార్థులకు 1259 మంది, సెకండ్ ఇయర్‌లో 1740 మందికి 1439 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల్లో గతేడాది 56% రాగా ఈ ఏడాది 73.03 % , సెకండ్ ఇయర్‌లో గత ఏడాది 72.07 శాతం, ఈఏడాది 82.34% మంది విద్యార్థులు పాసయ్యారు.
News April 13, 2026
KMR: ఎక్కడ లోపం జరిగింది.. ఇంటర్ ఫలితాలపై ఆరా..!

జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా అట్టడుగు స్థానాలకు పడిపోవడంపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఫస్ట్ ఇయర్ 49.40% ఉత్తీర్ణతతో 33వ స్థానానికి, సెకండియర్ లో 63.09% ఫలితాలతో 32వ ర్యాంకుకు జిల్లా పరిమితమైంది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో ఇబ్బందులా… వసతుల్లేవా అనే కారణాలు తెలుసుకుంటున్నారు.
News April 13, 2026
నిజామాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా

నిజామాబాద్ జిల్లాలో ఇంటర్ ఫలితాల గణాంకాలపై విద్యాశాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. రాష్ట్రస్థాయి ర్యాంకింగ్స్‌లో జిల్లా వెనుకబడటం చర్చనీయాంశమైంది. ప్రథమ సంవత్సరంలో 56.64% ఉత్తీర్ణతతో 25వ స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరంలో పరిస్థితి మరింత దిగజారి 66.19% ఉత్తీర్ణతతో 29వ ర్యాంకుకు పడిపోయింది. ఎక్కడ లోపం జరిగింది.. బోధనలో మార్పు రావాలా.. విద్యావ్యవస్థలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చలు చేస్తున్నారు.


