News February 18, 2025
వరంగల్: 16 ఏళ్ల తర్వాత నెరవేరిన కల!

వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామానికి చెందిన చిలుముల రాములు తేజ దంపతుల కొడుకు ఏలియా. చిన్నతనం నుంచే టీచర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులను కాంట్రాక్ట్ ఎస్జీటీలుగా నియమించింది. చిలుముల ఏలియాకు దాదాపు 16 ఏళ్ల తర్వాత ఉద్యోగం రావడంతో వారి ఆనందానికి హద్దులు లేవు. కొడుకు కల నెరవేరిందని సంతోష పడుతున్నారు.
Similar News
News October 21, 2025
NGKL: తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన తెలంగాణ రైజింగ్ 2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 25 నాటికి సర్వే ముగుస్తుందని తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. సిటిజన్ సర్వేలో తెలంగాణ ప్రాంత పౌరులు మాత్రమే పాల్గొని తమ విలువైన సందేశాన్ని అందజేయాలని కోరారు.
News October 21, 2025
రైజింగ్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: ADB కలెక్టర్

తెలంగాణ రైజింగ్ సర్వేలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజార్షి షా సూచించారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం కీలకమన్నారు. తెలంగాణ రైజింగ్ – 2047 సిటిజన్ సర్వేలో అందరూ తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సర్వేకు ప్రజల నుంచి స్పందన లభిస్తోందన్నారు. ప్రజలు www.telangana.gov.in/telanganarising వెబ్‌సైట్‌లో తమ అమూల్యమైన సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు.
News October 21, 2025
HYD: ‘డిసెంబర్ 6లోపు వక్ఫ్ ఆస్తులు అప్‌డేట్ చేయాలి’

సెంట్రల్ వక్ఫ్ కమిటీ ఆదేశాల మేరకు డిసెంబర్ 6వ తేదీలోపు వక్ఫ్ ఆస్తుల డేటాను ఉమీద్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డు మేనేజ్‌మెంట్ కమిటీలకు, ముతవల్లీలను కోరింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర వక్ఫ్ కమిటీ కార్యాలయం తగిన సహకారం అందిస్తుందని పేర్కొన్నారు. HYD నాంపల్లిలోని వక్ఫ్ కార్యాలయంలో ముతవల్లీలు, మేనేజ్‌మెంట్ కమిటీలకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేశారు.