News May 7, 2024
వరంగల్: 18-39 ఏళ్ల వారే కీలకం!
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండు లోక్‌సభ స్థానాల్లో యువ ఓటర్లు కీలకం కానున్నారు. మహబూబాబాద్, వరంగల్ లోక్‌సభ పరిధిలో 33,56,832 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 16,22,871 మంది 18-39 ఏళ్ల వారే. మొత్తం ఓటర్లలో వీరి శాతం 48.34. కాగా మహబూబాబాద్ పరిధిలో 50.33%, వరంగల్‌లో 46.67% మంది ఆ వయస్సు ఉన్న ఓటర్లు ఉన్నారు. దీంతో యువ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఎంపీ అభ్యర్థులు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
Similar News
News January 18, 2025
సమ్మక్క సారలమ్మలను దర్శించుకున్న ఎస్పీ
మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను ములుగు ఎస్పీ శబరిష్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎండోమెంట్ అధికారులు, ఆలయ పూజారుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ సంప్రదాయ ప్రకారం డోలు వాయిద్యాలతో ఎస్పీ శబరీష్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం సమ్మక్క సారలమ్మలకు, పగిడిద్ద రాజు, గోవిందరాజులకు ఎస్పీ మొక్కులు చెల్లించారు.
News January 17, 2025
జాతర బందోబస్తు ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ శబరీష్
ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు మినీ మేడారం జాతర జరగనుంది. ఈ సందర్భంగా మేడారంలోని పార్కింగ్ స్థలాలు, వాహనాల రద్దీకి అనుగుణంగా బందోబస్తు ఏర్పాట్లును ఎస్పీ శబరిష్ పరిశీలించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, దొంగతనాల నివారణకు, ప్రమాదాల నివారణ కోసం సీసీ కెమెరాల ఏర్పాటుపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ శబరిష్ సూచనలు చేశారు.
News January 17, 2025
డ్రగ్స్ వ్యతిరేక ప్రచార పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి కొండా
డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పిలుపు మేరకు డ్రగ్స్, మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజలను జాగృతం చేసేందుకు తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్స్ యూనియన్ రాష్ట్రవ్యాప్త ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. వరంగల్ జిల్లాలో నిర్వహించే డ్రగ్స్ వ్యతిరేక ప్రచార కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు.