News June 5, 2024
వరంగల్: 2014లో తండ్రి.. 2024లో కుమార్తె!

వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికల్లో అప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం శ్రీహరి కాంగ్రెస్ అభ్యర్థి సిరిసిల్ల రాజయ్యపై 3,92,574 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి కడియం కుమార్తె కావ్య పోటీ చేసి 2,20,339 ఆధిక్యంతో విజయం సాధించారు. ఇప్పుడు ఒకే పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కుమార్తె ఎంపీగా.. తండ్రి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించనున్నారు.
Similar News
News December 4, 2025
వరంగల్ జిల్లా తొలి విడత ఎన్నికల్లో 11 స్థానాలు ఏకగ్రీవం

మొదటి విడత స్థానిక ఎన్నికల్లో WGL జిల్లాలో 11 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రాయపర్తి మండలంలో 6, పర్వతగిరిలో 3, వర్ధన్నపేటలో 2 చోట్ల ఏకగ్రీవాలు నమోదయ్యాయి. పోతురెడ్డిపల్లి, కిష్టపురం సూర్యతండా, బాలునాయక్ తండాల్లో కాంగ్రెస్ నుండి సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్వతగిరిలో మోత్యతండా, సూపతండా, శ్రీనగర్‌లో కూడా ఏకగ్రీవం కాగా వర్ధన్నపేటలో రామోజీ కుమ్మరిగూడెం, చంద్రుతండా అయ్యాయి.
News December 4, 2025
వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.