News April 12, 2025
వరంగల్: 21వ తేదీ నుంచి డిగ్రీ సెమిస్టర్స్

కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ 2, 4, 5, 6వ సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 21 నుంచి ప్రారంభమవుతున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ కట్ల రాజేందర్ వెల్లడించారు. ఇందుకు సంబంధించిన టైం టేబుల్‌ను యూనివర్సిటీ అధికారులు విడుదల చేశారు. పూర్తి వివరాలకు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడాలన్నారు.
Similar News
News December 3, 2025
కృష్ణా: డీసీసీ అధ్యక్షుల రేసులో అందె, శొంఠి

కాంగ్రెస్ పార్టీ పునః నిర్మాణంలో భాగంగా తొలుత డీసీసీ అధ్యక్షుల నియామకం చేపట్టనుంది. కృష్ణాజిల్లా డీసీసీ పదవికి ఆశావహులు పోటీపడుతున్నారు. ప్రధానంగా అవనిగడ్డకు చెందిన అందే శ్రీరామ్మూర్తి, పెడనకు చెందిన శొంఠి నాగరాజు రేసులో ముందు ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామకంపై ఇటీవలే జిల్లాకు పరిశీలకునిగా వచ్చిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి సంజయ్ దత్ మచిలీపట్నం వచ్చి అభిప్రాయసేకరణ చేపట్టి వెళ్లారు.
News December 3, 2025
స్కూళ్లలోకి అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్‌లు

AP: టీచర్ల కొరతను అధిగమించేందుకు స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను నియమించనున్నారు. గతంలో పని చేసిన విద్యా వాలంటీర్ల మాదిరే వీరు విధులు నిర్వర్తిస్తారు. ఇటీవల మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసినా పలు స్కూళ్లలో ఇంకా ఖాళీలున్నాయి. మొత్తం 1,146 పోస్టుల్లో ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి ఉత్తర్వులు విడుదలయ్యాయి. విధుల్లో చేరిన తర్వాత స్కూల్ అసిస్టెంట్లకు నెలకు రూ.12,500, ఎస్జీటీలకు రూ.10వేలు ఇస్తారు.
News December 3, 2025
అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామక ప్రక్రియ ఇలా..

AP: మండలస్థాయిలో ఉన్న ఖాళీలపై MEO ప్రకటన చేయనుండగా, ఇవాళ్టి నుంచి 5వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్లను MEO ఆఫీసుల్లో సమర్పించాలి. అకడమిక్(75%), ప్రొఫెషనల్(25%) అర్హతల ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది. స్థానిక గ్రామాలు, మండలాల వారికి ప్రాధాన్యత ఉంటుంది. ఈ నెల 7వ తేదీలోగా కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఫైనల్ అర్హుల జాబితాను ఖరారు చేస్తుంది. తర్వాతి రోజు నుంచే విధులకు హాజరవ్వాల్సి ఉంటుంది.


