News February 25, 2025
వరంగల్: 75 వేలకు పైగా మిర్చి బస్తాలు రాక

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు మిర్చి పోటెత్తింది. రేపటి నుంచి ఐదు రోజుల పాటు వరంగల్ మార్కెట్‌కు సెలవులు ఇచ్చిన విషయం విదితమే. ఈ క్రమంలో మంగళవారం మార్కెట్‌కి రికార్డు స్థాయిలో 75 వేలకు పైగా మిర్చి బస్తాలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. అయితే మిర్చి ధరలు భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 26, 2025
అనకాపల్లి: చట్ట విరుద్ధమైన సమావేశాలపై నిషేధం

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరుగుతున్న నేపథ్యంలో మంగళవారం నుంచి ఈనెల 28వ తేదీ వరకు అనకాపల్లి జిల్లాలో చట్టవిరుద్ధమైన సమావేశాలు, ర్యాలీలను నిషేధించినట్లు కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటించారు. అలాగే లౌడ్ స్పీకర్లకు అనుమతి లేదన్నారు. పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలో ఐదుగురు కంటే ఎక్కువమంది గుమ్మికూడి ఉండరాదని అన్నారు. పై ఆదేశాలను దిక్కరిస్తే చర్యలు తప్పవన్నారు.
News February 26, 2025
పాలకుర్తిలో శివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన డీపీఓ

పాలకుర్తిలోని మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను డీపీవో స్వరూప మంగళవారం పరిశీలించారు. ఆలయ ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు, తాగునీరు, చలువ పందిళ్లు, విద్యుత్తు సౌకర్యం ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేసేలా దిశా నిర్దేశం చేశారు. అక్కడే ఉండి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు.
News February 26, 2025
జనగామ: ఇంటర్‌లో మంచి ఫలితాలు సాధించాలి: డీఐఈవో

రానున్న ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని డీఐఈఓ జితేందర్ రెడ్డి అన్నారు. జనగామలోని ధర్మకంచెలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మంగళవారం వీడ్కోలు సమావేశం కళాశాల ప్రిన్సిపల్ పావని అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. ఉత్తమ ఫలితాలు సాధించడమే కాకుండా ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని ఆకాంక్షించారు.