News April 24, 2024
వరంగల్ BRS అభ్యర్థిపై ఎలాంటి కేసులు లేవు!

వరంగల్ పార్లమెంట్ BRS అభ్యర్థి మరపల్లి సుధీర్కుమార్ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో ఆయన ఆస్తి వివరాలను పొందుపర్చారు. ఆయన కుటుంబానికి రూ.2.04 కోట్ల ఆస్తులు ఉండగా.. టాటా జెస్ట్ కారు, 8తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. హన్మకొండలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల వ్యవసాయేతర భూమితో పాటు.. ఒక ఇల్లు ఉంది. మొత్తం 1.79 కోట్ల స్థిరాస్తులుండగా.. ఈయనకు ఎలాంటి అప్పులు, క్రిమినల్ కేసులు లేవు.
Similar News
News October 25, 2025
ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలి: సి.సుదర్శన్ రెడ్డి

ఎస్ఐఆర్ ఓటర్ జాబితా పకడ్బందీగా తయారు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సూచించారు. శనివారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన 2002 ఎస్.ఐ.ఆర్. డేటాను 2025 జాబితాతో మ్యాపింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా స్థితిగతులను వివరించారు. బి.ఎల్.ఓ. యాప్పై వివరణ ఇచ్చారు.
News October 25, 2025
భూ భారతి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: కలెక్టర్

ప్రభుత్వం చేపట్టిన భూభారతి కార్యక్రమం కింద రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. శనివారం వర్ధన్నపేట తహశీల్దార్ కార్యాలయాన్ని సందర్శించిన ఆమె, భూభారతి దరఖాస్తులపై సమీక్ష జరిపారు. పెండింగ్లో ఉన్న ఆర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని, క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని సూచించారు.
News October 25, 2025
ఫోన్ చేసి పిలిపించి… గోదాం తీయించి..!

వర్ధన్నపేట పట్టణంలోని పౌరసరఫరాల శాఖ గిడ్డంగి తాళం వేసి ఉండటంపై కలెక్టర్ సత్యశారద ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఫోన్ చేసి రప్పించి ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ శృతి వర్షిని, పౌరసరఫరాల అధికారి సంధ్యారాణితో కలిసి గిడ్డంగిని పరిశీలించారు. వారు క్షేత్ర స్థాయిలో స్టాక్ రిజిస్టర్ను, గోదాంలోని బియ్యం నిల్వ వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నివేదికను కలెక్టర్కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.


