News April 24, 2024

వరంగల్ BRS అభ్యర్థిపై ఎలాంటి కేసులు లేవు!

image

వరంగల్ పార్లమెంట్ BRS అభ్యర్థి మరపల్లి సుధీర్‌కుమార్ నామినేషన్ సందర్భంగా అఫిడవిట్‌లో ఆయన ఆస్తి వివరాలను పొందుపర్చారు. ఆయన కుటుంబానికి రూ.2.04 కోట్ల ఆస్తులు ఉండగా.. టాటా జెస్ట్ కారు, 8తులాల బంగారు ఆభరణాలు ఉన్నాయి. హన్మకొండలో 18 ఎకరాల వ్యవసాయ భూమి, 300 గజాల వ్యవసాయేతర భూమితో పాటు.. ఒక ఇల్లు ఉంది. మొత్తం 1.79 కోట్ల స్థిరాస్తులుండగా.. ఈయనకు ఎలాంటి అప్పులు, క్రిమినల్ కేసులు లేవు.

Similar News

News February 11, 2026

వరంగల్: ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు

image

జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు బుధవారంతో ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 2న ప్రారంభమైన ఈ పరీక్షలు ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విజయవంతంగా పూర్తయినట్లు DIEO శ్రీధర్ సుమన్ తెలిపారు. చివరి రోజున జిల్లా వ్యాప్తంగా 300 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల నిర్వహణలో సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన చీఫ్ సూపరింటెండెంట్లు, అధ్యాపక బృందాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు.

News February 11, 2026

WGL: 9 గంటల వరకు 12.44 శాతం పోలింగ్

image

వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో తొలి రెండు గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 12.44 శాతం ఓటింగ్ నమోదైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02 శాతంతో ఓటర్లు చైతన్యం చూపగా, నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.

News February 11, 2026

హరిత పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన వరంగల్ ఆర్డీఓ

image

వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఫిరంగిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ‘హరిత’ పోలింగ్ కేంద్రాన్ని వరంగల్ ఆర్డీఓ టి.సుమ బుధవారం సందర్శించారు. పర్యావరణ హితంగా, ఆకట్టుకునేలా తీర్చిదిద్దిన ఈ కేంద్రాన్ని చూసి ఆమె ముగ్ధులయ్యారు. పోలింగ్ సరళిని అధికారులతో కలిసి సమీక్షించిన అనంతరం, హరిత పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ దగ్గర సహచర అధికారులతో కలిసి సరదాగా ఫొటోలు దిగారు.