News March 3, 2025
వరంగల్: COUNTING.. ముందంజలో పీఆర్టీయూ అభ్యర్థి

ఉమ్మడి వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. సోమవారం ఉదయం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఆర్జాలబావి దగ్గర గల గోదాంలో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు ఉండగా మొదటి రౌండ్లో పీఆర్టీయూ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి ముందంజలో ఉన్నారు. శ్రీపాల్ రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి, పూల రవీందర్ మధ్య పోటీ నెలకొంది.
Similar News
News November 28, 2025
జర్నలిస్టులకు అనంతపురం కలెక్టర్ గుడ్ న్యూస్

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువును మరో రెండు నెలల పాటు పొడిగిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆనంద్ ప్రకటించారు. సమాచార, పౌర సంబంధాల శాఖ సంచాలకులు కె.ఎస్. విశ్వనాథన్ ఆదేశాల మేరకు ఈ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. పొడిగించిన గడువు 1.12.2025 నుంచి 31.1.2026 వరకు ఉంటుందని కలెక్టర్ మీడియాకు తెలిపారు. ఈ మేరకు జర్నలిస్టులందరూ గమనించగలరు.
News November 28, 2025
పెద్దపల్లి: FDHS సిబ్బందికి వీడ్కోలు సన్మానం

పెద్దపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా.వాణిశ్రీ ఆధ్వర్యంలో FDHS స్కీమ్లో సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి శుక్రవారం వీడ్కోలు కార్యక్రమం జరిగింది. డేటా ఎంట్రీ ఆపరేటర్లు సదానందం, సాజిద్, శ్రీనివాస్, మీర్జా, వాచ్మ్యాన్ రాజయ్యలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలకు బదిలీ అయ్యారు. తక్కువ వేతనంతో కీలకంగా సేవలందించిన వీరిని డా.వాణిశ్రీ అభినందించారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
News November 28, 2025
SKLM: ఏడు రోజుల మహోత్సవానికి పకడ్బందీ ప్రణాళిక

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి మహోత్సవం ఈసారి ఏడు రోజుల పాటు (జనవరి 19 నుంచి 25 వరకు) అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. శుక్రవారం కలెక్టరేట్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తదితరులు సమీక్ష నిర్వహించారు. దేవస్థానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది, ప్రతి రోజు ఒక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించాలన్నారు.


