News April 4, 2025
వరంగల్- HYD పుష్-పుల్ ట్రైన్ నడపండి.. ఎంపీ కావ్య విజ్ఞప్తి

ఉదయం వేళ వరంగల్ నుంచి హైదరాబాద్‌కు పుష్పుల్ రైలు నడపాలని శుక్రవారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య కోరారు. ఈమేరకు పార్లమెంట్లో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఆమె మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి ప్రజలు రోజువారి పనుల నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్తుంటారని, వారికి సౌకర్యార్థంగా రైలులు నడపాలని వివరించారు. దీనిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎంపీ తెలిపారు.
Similar News
News December 9, 2025
మద్యం షాపులు బంద్: జనగామ కలెక్టర్

గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజా శాంతి భద్రతల కోసం మద్యం షాపులు, బార్లు, కల్లు దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ పూర్తయ్యే వరకు మూడు ఫేజ్‌ల్లో మండలాల వారీగా మూసివేత అమలు కానుందన్నారు. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
News December 9, 2025
భద్రాద్రి: ప్రేమ పేరుతో మోసం.. యువకుడికి జైలు శిక్ష!

ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వేరొక యువతిని వివాహం చేసుకున్న కేసులో నిందితుడు పొట్ట కృష్ణార్జున రావుకు దమ్మపేట జ్యుడీషియల్ కోర్టు రెండున్నరేళ్ల సాధారణ జైలు శిక్ష విధించింది. ఎస్ఐ యాయతి రాజు తెలిపిన వివరాలు.. అశ్వారావుపేట మం. బండారిగుంపు గ్రామానికి చెందిన యువతి ఫిర్యాదు మేరకు 2017లో కేసు నమోదైంది. ఈ కేసులో విచారణ అనంతరం మెజిస్ట్రేట్ భవాని రాణి తీర్పు వెల్లడించినట్లు తెలిపారు.
News December 9, 2025
ప్రకాశం: ‘డిసెంబర్ 31 వరకు అవకాశం’

ఇంట్లో గృహోపకరణాలపై అడిషనల్ లోడ్‌పై చెల్లింపులో 50% రాయితీ ఇస్తున్నట్లు SE కట్టా వెంకటేశ్వర్లు తెలిపారు. 1కిలో వాట్‌కు రూ.2250 అవుతుందని రాయితీ వలన రూ.1250 చెల్లించవచ్చని అన్నారు. ఈ అవకాశం ఈనెల 31 వరకు మాత్రమేనని తెలిపారు. ఇంట్లో గృహోపకరణాలను బట్టి లోడ్ కట్టుకోవాలన్నారు. తనిఖీల్లో లోడ్ తక్కువగా ఉంటే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.


