News August 29, 2024
వరంగల్ MGMలో కనీస వసతులు కరవు
వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కనీస సౌకర్యాలు, వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. హాస్పిటల్‌లోని క్యాజువాలిటిలో ఫ్లూయిడ్ స్టాండ్లు, స్ట్రెచ్చర్లు లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చిన రోగులు ఈరోజు ఇబ్బంది పడ్డారు. రోగులను కుర్చీలో కూర్చోబెట్టి అటెండెంట్ చేతికి సెలైన్ బాటిల్ ఇచ్చి వైద్యం అందిస్తున్నారు. దీనిపై రోగులు, వారి బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News September 19, 2024
ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే చేయండి: కలెక్టర్
గ్రేటర్ వరంగల్ పరిధిలో నాలాలు, చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలను గుర్తించి తదుపరి చర్యలు చేపట్టాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈనెల 17న ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దృష్టికి నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణల అంశాన్ని తీసుకువెళ్లారు.
News September 19, 2024
వరంగల్ రైల్వే స్టేషన్లో బాటిల్ క్రషింగ్ మిషన్
వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రయాణికులకు రైల్వే అధికారులు సింగల్ యూజ్ ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ మేనేజర్ భర్తేష్ కుమార్ జైన్ ఆదేశాల మేరకు వరంగల్ రైల్వేస్టేషన్లో బాటిల్ క్రషింగ్ మిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వాటర్ బాటిల్స్ లాంటివి ఈ యంత్రంలో పడవేస్తే, తుక్కు తుక్కుగా మారుస్తుందని అధికారులు రైల్వే ప్రయాణికులకు తెలిపారు.
News September 19, 2024
సైన్స్ సెంటర్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే, కలెక్టర్
హనుమకొండలోని రీజనల్ సైన్స్ సెంటర్లో ఆధునిక సైన్స్ వనరుల కల్పనతో పాటు అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేసి అందజేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ పి.ప్రావీణ్య సైన్స్ సెంటర్ అధికారులను ఆదేశించారు. రీజనల్ సైన్స్ సెంటర్‌ను జిల్లా అధికారులతో కలిసి నేడు ఎమ్మెల్యే పరిశీలించారు. సైన్స్ సెంటర్‌కు కావాల్సిన ఆధునిక సైన్స్ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు.