News February 26, 2025
వరంగల్: MGM ఆస్పత్రి నుంచి పారిపోయాడు..!

వరంగల్ MGM ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి ఎవరికీ చెప్పకుండా పారిపోయాడు. ఈ విషయమై ఆస్పత్రిలో ఉన్న అతడి తల్లి లక్ష్మీ స్థానిక పోలీస్ స్టేషన్లో మంగళవారం ఫిర్యాదు చేసింది. భూపాలపల్లి జిల్లాకు చెందిన పద్మాకర్ అనారోగ్య రీత్యా ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ తరుణంలో ఎవరికీ చెప్పకుండా ఎంజీఎం నుంచి పారిపోయాడు. ఎవరికైనా ఆచూకీ తెలిసినట్లయితే మాట్వాడ పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.
Similar News
News October 29, 2025
అధ్వానంగా హోం మంత్రి పాదయాత్ర చేసిన రోడ్డు

కోటవురట్ల, ఎస్.రాయవరం మండలాల సరిహద్దులో ఇందేశమ్మవాగు ప్రాంతంలో ఆర్.అండ్.బీ.రహదారి పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఇంతకు ముందే శిథిలావస్థకు చేరుకున్న ఈ రహదారి వర్షాలకు మరింత దమనీయంగా తయారైంది. రహదారిపై ఏర్పడిన గోతుల్లో వర్షపు నీరు చేరడంతో నీటి కుంటలను తలపిస్తున్నాయి. దీనిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనిత గత ప్రభుత్వ హయాంలో పాదయాత్ర చేశారు.
News October 29, 2025
HYD: అలెర్ట్ మరికాసేపట్లో వర్షం

హైదరాబాద్లో రానున్న 1-2 గంటల్లో తేలికపాటి వర్షం (<5 MM) పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, ఈదురుగాలులు గంటకు 40 KM వరకు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. వాతావరణం మేఘావృతంగా ఉంటుందని పేర్కొంది. వర్షం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నగర వాసులు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
News October 29, 2025
అరటి పరిమాణం పెంచే ‘బంచ్ ఫీడింగ్’ మిశ్రమం

అరటి కాయల పరిమాణం పెరుగుదలకు భారతీయ ఉద్యాన పరిశోధన సంస్థ బంచ్ ఫీడింగ్ మిశ్రమం రూపొందించింది. 100ml నీటిలో 7.5 గ్రా. నత్రజని ఎరువు, 7.5 గ్రాముల పొటాష్ ఎరువు కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని 500 గ్రాముల పేడలో బాగా కలపాలి. అనంతరం ఈ మిశ్రమాన్ని పైన ఫొటోలో చూపినట్లు కాయలు కాసిన తర్వాత క్రింది పువ్వును కత్తిరించి, ఆ మిశ్రమం ఉన్న పాలిథిన్ సంచిలో కాయలు కాసిన కాడకు ఒక అడుగు దూరం వదిలి గట్టిగా కట్టాలి.


