News March 3, 2025

వరంగల్: MLC ఎన్నికలు.. మొదటి రౌండ్ ఫలితాలు

image

WGL-KMM-NLG ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు ఫలితాలను అధికారులు వెల్లడించారు.
1) PRTU అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి – 6,035
2) UTF అభ్యర్థి నర్సిరెడ్డి – 4,820
3) స్వతంత్ర అభ్యర్థి హర్షవర్ధన్ రెడ్డి- 4,437
4) స్వతంత్ర అభ్యర్థి పూల రవీందర్- 3,115
5) BJP మద్దతు అభ్యర్థి సరోత్తంరెడ్డి- 2,289
కాగా మొత్తం 19 మంది అభ్యర్థులకు చెల్లిన ఓట్లు 23,641, చెల్లని ఓట్లు 494

Similar News

News November 25, 2025

జనగామ: డబుల్ బెడ్ రూంల పరిస్థితి ఏంటి.?

image

జిల్లాలోని ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబుల్ బెడ్రూంలు ఇప్పటికీ నిరుపయోగంగానే ఉన్నాయి. అప్పటి ప్రభుత్వంలో వాటిని పంచకపోవడం, కొత్తగా ప్రభుత్వం వచ్చినప్పటికీ వాటిని పట్టించుకోకపోవడంతో కొన్ని గ్రామాల్లో నిర్మించిన ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు పట్టించుకుని పేద కుటుంబాలకు వాటిని పంచి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

News November 25, 2025

ఎచ్చెర్ల : స్పాట్ అడ్మిషన్లకు కసరత్తు

image

డాక్టర్ బి.ఆర్.అంబేడ్క‌ర్ విశ్వవిద్యాలయంలో మిగులు సీట్లకు స్పాట్ అడ్మిషన్లను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏపీ పీజీ సెట్-2025 ద్వారా రెండు విడతల కౌన్సెలింగ్ పూర్తి చేయగా 19 కోర్సుల్లో 600 సీట్లకు 252 ప్రవేశాలు జరిగాయి. కొన్ని కోర్సుల్లో ఎక్కువగా సీట్లు మిగిలి ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని యూనివర్సిటీలు ఇప్పటికే స్పాట్ అడ్మిషన్లు ప్రారంభించాయి. త్వరలో ప్రకటన విడుదల చేయనున్నారు.

News November 25, 2025

విశాఖ ప్రజలకు గుడ్ న్యూస్

image

విశాఖకు పర్యాటక రంగంలో తలమానికంగా కైలాసగిరిపై గ్లాస్ బ్రిడ్జి నిర్మించిన విషయం తెలిసిందే. దీనిని ఎప్పుడు ప్రారంభిస్తారా? అని నగర ప్రజలతో పాటు పర్యాటకులు ఎదురు చూస్తున్నారు. ఈనెల 30 లేదా డిసెంబర్ 1న అధికారికంగా దీనిని ప్రారంభించనున్నారు. విశాఖ ఎంపీ భరత్ చేతుల మీదుగా ఓపెన్ చేస్తారని సమాచారం.