News July 7, 2024

వరంగల్: SI మరణ వార్త విని మేనత్త గుండెపోటుతో మృతి

image

ఆత్మహత్యాయత్నం చేసిన అశ్వారావుపేట SI శ్రీరాముల శ్రీనివాస్ చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం తెలిసిందే. శ్రీనివాస్ మరణ వార్త విన్న ఆయన మేనత్త రాజమ్మ గుండెపోటుతో మృతి చెందింది. WGL జిల్లా దుగ్గొండి మండలం నాచినపల్లికి చెందిన రాజమ్మకు ఆదివారం గుండెపోటు రాగా వరంగల్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఒకే రోజున ఇద్దరు మృతి చెందడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Similar News

News December 10, 2024

వరంగల్: విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి జిల్లా మంత్రులు

image

డాక్టర్ బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు కొండా సురేఖ, సీతక్క పాల్గొన్నారు. సెక్రటేరియట్‌లో నిర్వహించిన విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు హాజరయ్యారు.

News December 9, 2024

సిద్దేశ్వరస్వామి వారికి ప్రత్యేక అలంకరణ

image

హన్మకొండలోని స్వయం భూ లింగం శ్రీ సిద్దేశ్వరస్వామి దేవాలయంలో మార్గశిర మాసం సోమవారం సందర్భంగా ఆలయ అర్చకులు సిద్దేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. వివిధ రకాల పూలతో అలంకరించి స్వామివారికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు సురేశ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2024

ములుగు: నేడు మావోయిస్టుల బంద్.. టెన్షన్.. టెన్షన్

image

నేడు మావోయిస్టులు బంద్‌కు పిలుపునిచ్చారు. దీంతో ములుగు జిల్లాలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏటూరునాగారం ఏజెన్సీలో పోలీసులు ఆదివాసీ గూడాలు, అడవుల్లో కూంబింగ్ ముమ్మరం చేశారు. ఎస్ఔ తాజుద్దీన్ ఆధ్వర్యంలో పలు లాడ్జీల్లో తనిఖీలు చేపట్టారు. ఎవరైన గుర్తు తెలియని వ్యక్తులు లాడ్జీల్లో ఉన్నారా..? అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెంచారు.