News April 21, 2025
వరంగల్: Wow.. ఆరు తరాల సయింపు వంశీయుల ఆత్మీయ సమ్మేళనం

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం అనంతారానికి చెందిన సయింపు కుటుంబానికి చెందిన ఆరు తరాల రక్త సంబంధీకులు ఇటీవల ఒక ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఒకేచోట కలుసుకున్నారు. చదువు, ఉద్యోగ అవసరాల కారణంగా వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డ వీరు.. కుటుంబ సమేతంగా పాల్గొని, ఒకరినొకరు ఆప్యాయంగా పలుకరించి ఆనందాన్ని పంచుకున్నారు. ఆత్మీయత, బంధుత్వం మరింత బలపడేలా ఈ సమావేశం కలిసొచ్చింది.
Similar News
News April 21, 2025
వరంగల్: మూడు జిల్లాల్లో విస్తరించిన ‘పాకాల’

పాకాల అభయారణ్యం అంటే ఒక్క వరంగల్ జిల్లానే అనుకుంటారు. నిజానికి పాకాల అడవి 839చ.కి.మీ విస్తీర్ణంతో వరంగల్‌తో పాటు మహబూబాబాద్, ములుగు జిల్లాలోనూ విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువులు, పక్షులు, సరీసృపాలకు అనువైనదిగా ఉంది. శీతాకాలంలో విదేశీ పక్షులు సైతం ఇక్కడ సందడి చేస్తాయి. నర్సంపేటకు 9 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాకాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సందర్శకులు వస్తుంటారు.
News April 21, 2025
నాడు ‘పాకాల’.. నేడు ‘నర్సంపేట’

ప్రస్తుత నర్సంపేట నియోజకవర్గం 1956లో ఏర్పడింది. అంతకుముందు హైదరాబాద్ సంస్థానంలో ఈ ప్రాంతాన్ని పాకాల నియోజకవర్గంగా పేర్కొనేవారు. మొదట్లో పాకాల తాలూకాగా తర్వాత నర్సంపేటగా రూపాంతరం చెందింది. 1952లో పాకాల ఎమ్మెల్యేగా ఏ.గోపాలరావు గెలుపొందారు. 1957లో నర్సంపేట ఎమ్మెల్యేగా కనకరత్నమ్మ గెలిచారు. దీంతో నర్సంపేట అంటే పాకాల.. పాకాల అంటే నర్సంపేటగా ప్రత్యేక గుర్తింపు ఉంది.
News April 21, 2025
పంట పొలాలు, చారిత్రక ఆనవాళ్లు.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత

18 గ్రామాలతో తనదైన అస్తిత్వం, చుట్టూ గ్రామీణ వాతావరణం, చారిత్రక ఆనవాళ్లు, కరవుకు ఎంతో దూరం.. ఇదీ దుగ్గొండి ప్రత్యేకత. నగరానికి కూరగాయలను ఉత్పత్తి చేసే ప్రాంతంగా దుగ్గొండి మొదటి స్థానంలో ఉండటం విశేషం. ఎన్నో రోగాలకు దివ్య ఔషధమైన తాటికళ్లును అందించే ప్రాంతంగా దుగ్గొండి గుర్తింపు పొందింది. మండల పరిధి కేశవాపురంలో వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా జరుగుతాయి.