News February 14, 2025
వరంగల్: WOW.. ప్రేమ పెళ్లి.. ఇద్దరికీ ఉపాధ్యాయ కొలువులు!

ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కడం చాలా అరుదు. పెద్దలు ఒప్పుకోకపోవడం, ఇతర కారణాలతో విడిపోయినవారినే ఎక్కువగా చూస్తుంటాం. కానీ, వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన వినయ్, నాగలక్ష్మిలు ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులుగా ఉన్న వీరు.. 2019లో వివాహం చేసుకున్నారు. అంతేకాదు, 2024 డీఎస్సీలో ఇద్దరు ఉపాధ్యాయ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News January 10, 2026
ప్రజావాణికి పెద్ద శంకరంపేటలో కలెక్టర్ హాజరు

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం (జనవరి 12) పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజలకు దూరభారం, ఖర్చులు తగ్గించేందుకు ఈ వినూత్న విధానం చేపట్టామని, ప్రతి వారం ఒక మండలంలో కలెక్టర్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 10, 2026
రికార్డు సృష్టించిన జెమీమా

WPLలో యంగెస్ట్ కెప్టెన్గా జెమీమా రోడ్రిగ్స్(25y 127days) రికార్డు సృష్టించారు. ఈ సీజన్లో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జెమీమా తర్వాతి స్థానంలో స్మృతి మంధాన(26y 230days-2023) ఉన్నారు. కాగా ఇవాళ ముంబైతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
News January 10, 2026
CM పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

CM చంద్రబాబు సంక్రాంతిని పురస్కరించుకొని 4 రోజులు పాటు ఆయన స్వగ్రామం నారావారిపల్లెలో పర్యటించనున్నారు. అలాగే పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. సంబంధిత పనులను కలెక్టర్ వెంకటేశ్వర్లు, SP సుబ్బారాయుడు శనివారం పరిశీలించారు. అనంతరం అధికారులతో సమావేశమయ్యి పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పులివర్తి నాని పాల్గొన్నారు.


