News February 14, 2025
వరంగల్: WOW.. ప్రేమ పెళ్లి.. ఇద్దరికీ ఉపాధ్యాయ కొలువులు!

ప్రేమించుకున్న ప్రతి జంట పెళ్లి పీటలెక్కడం చాలా అరుదు. పెద్దలు ఒప్పుకోకపోవడం, ఇతర కారణాలతో విడిపోయినవారినే ఎక్కువగా చూస్తుంటాం. కానీ, వరంగల్ జిల్లా నల్లబెల్లికి చెందిన వినయ్, నాగలక్ష్మిలు ప్రేమించి ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇంటర్మీడియట్ నుంచి స్నేహితులుగా ఉన్న వీరు.. 2019లో వివాహం చేసుకున్నారు. అంతేకాదు, 2024 డీఎస్సీలో ఇద్దరు ఉపాధ్యాయ కొలువులు సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
Similar News
News March 28, 2025
బెల్లంపల్లి: రైలు పట్టాలపై వ్యక్తి మృతి

బెల్లంపల్లి పట్టణం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే శాఖ హెడ్ కానిస్టేబుల్ సురేశ్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. సిర్పూర్ టౌన్ నుంచి భద్రాచలం వెళ్లే సింగరేణి ప్యాసింజర్ రైలుకింద పడి మృతిచెందినట్లు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని, ఎల్లో కలర్ రౌండ్ నెక్ టీ షర్ట్, గ్రీన్ కలర్ షార్ట్ ధరించి ఉన్నట్లు వెల్లడించారు.
News March 28, 2025
ASF: ‘అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి’

జాతీయ గ్రామీణ హామీ పథకం క్రింద జిల్లాలో చేపట్టిన సీసీ రహదారులు, మురుగు కాలువల నిర్మాణ పనులు ఈ నెల 30లోగా పూర్తి చేసి ఎంబీ రికార్డులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జూమ్ మీటింగ్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు 4 రోజులు మిగిలి ఉన్నాయన్నారు.
News March 28, 2025
మెదక్: ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య !

మెదక్ పట్టణం గాంధీ నగర్‌లో ఆర్థిక ఇబ్బందులతో ఆటో డ్రైవర్ ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహమ్మద్ ఫారుక్(32) తన రేకుల ఇంటిలోనే ఉరివేసుకున్నట్లు కుటుంబీకులు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించి విచారణ చేస్తున్నారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమని భావిస్తోన్నారు.