News August 11, 2024
వరగంల్: పసి ప్రాణాలను కాపాడేదెవరు?
వరంగల్ జిల్లాలో అమానవీయ ఘటనలు పెరుగుతున్నాయి. MGMలో శుక్రవారం కుక్కలు నోటకరచి తీసుకెళ్తున్న 2-3 రోజుల వయస్సున్న మృతశిశువును పోలీసులు గుర్తించారు. అంతేకాదు, ఈ ఏడాది మే 4న ఒక పసిపాపను మట్టిలో కదులుతున్న ఓ లారీ డ్రైవర్ గుర్తించాడు. గతేడాది డిసెంబర్‌లో తొర్రూరు డివిజన్ కేంద్రంలో మురుగు కాలువలో 7-9 రోజుల వయసున్న పసిబాబు మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలతో ఈ ఘోరాలను ఆపేదెవరంటూ జిల్లా ప్రజలు మండిపడుతున్నారు.
Similar News
News November 27, 2024
విజయోత్సవాలకు ఏర్పాట్లు చేయాలి: ములుగు కలెక్టర్
ప్రజా పాలన, విజయోత్సవాల కార్యక్రమం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ములుగు కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న నేపథ్యంలో ప్రజాపాలన, విజయయోత్సవ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఈనెల 29న స్థానిక డిఎల్ఆర్ గార్డెన్‌లో విజయోత్సవ కార్యక్రమం ఉంటుందన్నారు.
News November 27, 2024
వరంగల్: పెరిగిన పత్తి ధర
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిన్నటితో పోలిస్తే ఈరోజు పత్తి ధర పెరిగింది. సోమవారం క్వింటా కొత్త పత్తి ధర రూ.6,860 పలకగా. మంగళవారం రూ.6,770కి పడిపోయింది. బుధవారం రూ.70 పెరిగి రూ. 6,840 అయింది. మార్కెట్లో ధరలు పెరుగుతూ తగ్గుతుండడంతో రైతన్నలు అయోమయానికి గురవుతున్నారు. ధరలు పెరిగేలా చూడాలని కోరుతున్నారు.
News November 27, 2024
చలి తీవ్రతతో వణుకుతున్న ఓరుగల్లు!
ఉమ్మడి వరంగల్ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతోంది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో చలి ప్రభావ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ప్రధానంగా ములుగు, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో చలి జ్వర పీడితులు పెరుగుతున్నారు. చిన్నారులు, వయో వృద్ధుల్లో జ్వరం, జలుబు, దగ్గు, ఆస్తమా వంటివి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.