News March 25, 2024
వరదయ్యపాళెం: అక్క మరణాన్ని తట్టుకోలేక దివ్యాంగుడి ఆత్మహత్య

మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన బీఎన్ కండ్రిగ మండలంలో చోటుచేసుకుంది. SI ప్రతాప్ వివరాల ప్రకారం.. కంచనపుత్తూరునకు చెందిన ప్రత్యేక ప్రతిభావంతుడైన బాలమురుగయ్య (26) మండలంలోని ఇందిరానగర్ పంచాయతీ పద్మావతిపురంలో నివాసముంటూ వరదయ్యపాళెం SBI ఎదురుగా నెట్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. ఇటీవల అక్క హత్యకు గురికాగా మనస్తాపానికి గురై పురుగుమందు తాగాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
Similar News
News November 12, 2025
కాణిపాక ఆలయానికి రూ.1.06 కోట్ల ఆదాయం

కాణిపాకంలో ఆన్లైన్, సీల్డ్ టెండర్లు, బహిరంగ వేలాలు బుధవారం నిర్వహించారు. ఈక్రమంలో దేవస్థానానికి మొత్తం రూ.1,06,99,997 ఆదాయం లభించింది. షాపింగ్ కాంప్లెక్స్, హోటల్ లైసెన్స్ హక్కు రూ.54.63 లక్షలు, పాదరక్షల భద్రపరుచుకునే హక్కు రూ.24.56 లక్షలు, వినాయక సదన్ హోటల్ లైసెన్స్ హక్కు రూ.27.10 లక్షలు, కళ్యాణమండపం షాపు హక్కు రూ.70 వేలు పలికిందని ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు.
News November 12, 2025
చిత్తూరు: టెన్త్ విద్యార్థులకు గమనిక

జిల్లాలోని అన్ని యాజమాన్య స్కూళ్లలో పదో తరగతి విద్యార్థులు అపరాధ రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈ నెల 25 వరకు అవకాశం కల్పించినట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. రూ.50 అపరాధ రుసుంతో ఈ నెల 26 నుంచి డిసెంబర్ 3 వరకు, రూ.200 రుసుంతో డిసెంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు, రూ.500తో డిసెంబర్ 11 నుంచి 15 వరకు అవకాశం ఉంటుందన్నారు.
News November 12, 2025
చిత్తూరులో ఏక్తా దివస్ ర్యాలీ

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని బుధవారం చిత్తూరులో రాష్ట్రీయ ఏక్తా దివస్ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమళ్ల ప్రసాద రావు పాల్గొన్నారు. గాంధీ సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సర్దార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎమ్మెస్సార్ సర్కిల్ వరకు ర్యాలీ కొనసాగింది.


