News December 18, 2024
వరదరాజపురం వద్ద షాపులోకి దూసుకెళ్లిన వ్యాను

గణపవరం మండలం వరదరాజపురం వద్ద బుధవారం త్రుటిలో ప్రమాదం తప్పింది. తాడేపల్లిగూడెం నుంచి గణపవరం వస్తున్న వ్యాను వరదరాజపురం వద్ద చికెన్ షాపులోకి దూసుకెళ్లింది. ఘటనలో రెండు టూ వీలర్లు నుజ్జు నుజ్జు అయినట్లు తెలుస్తోంది. కాగా ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Similar News
News November 22, 2025
ప.గో: అప్డేట్ కోసం కానిస్టేబుల్ అభ్యర్థుల ఎదురుచూపులు

ట్రైనింగ్‌పై హోం శాఖ నుంచి ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో 6,100 మంది కానిస్టేబుల్ అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. 2022లో నోటిఫికేషన్ ఇవ్వగా.. 2023ప్రిలిమ్స్, 2025 జనవరిలో ఈవెంట్స్, జూన్ 1న మెయిన్స్ నిర్వహించి ఆగస్టు 1న ఫలితాలు ఇచ్చారు. నాలుగు నెలలు గడుస్తున్నా ట్రైనింగ్‌పై అప్డేట్ లేకపోవడంతో అభ్యర్థులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. హోం మంత్రి అనిత స్పందించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
News November 22, 2025
ప.గో: మాక్ అసెంబ్లీలో ‘రియల్’ పాలిటిక్స్?

మాక్ అసెంబ్లీకి విద్యార్థుల ఎంపిక ప్రక్రియలో పశ్చిమ గోదావరి జిల్లాలో గందరగోళం నెలకొంది. క్విజ్‌లో ప్రతిభ చూపిన తాడేరుకు చెందిన ఉమా లిఖిత ఎంపికైనట్లు విద్యా శాఖ ప్రకటించిందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. చివరి నిమిషంలో జాబితా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ మార్కులు వచ్చిన రాయకుదుర్రు విద్యార్థిని ఎంపిక చేయడం వెనుక రాజకీయ జోక్యం ఉందని ఆరోపిస్తున్నారు. విద్యాశాఖ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
News November 22, 2025
ప.గో: హెలికాప్టర్ దిగగానే.. పవన్ కళ్యాణ్ రూట్ మ్యాప్ ఇదిగో!

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల 24న ద్వారకాతిరుమల మండలంలో పర్యటిస్తారు. కొయ్యలగూడెం (M) రాజవరంలో హెలిప్యాడ్‌లో దిగి అక్కడ నుంచి ద్వారకాతిరుమల మండలం జగన్నాథపురం చేరుకుంటారు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో అభివృద్ధి పనులకు పవన్ శంకుస్థాపన చేస్తారు. ముందుగా ఆయన స్వామివారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. శుక్రవారం ఏర్పాట్లను కలెక్టర్ వెట్రిసెల్వి పరిశీలించారు.


