News July 21, 2024
వరదలు.. గోదావరిపై పడవల్లో రాకపోకలు నిషేధం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరికి వరదలు పెరగడంతో సఖినేటిపల్లి – నరసాపురం మధ్య గోదావరి నదిపై పంటు, నాటుపడవలపై రాకపోకలు నిలిపివేసినట్లు అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. ధవళేశ్వరం బ్యారేజి నుంచి లక్షలాది క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయడంతో ముందస్తు జాగ్రత్తగా గోదావరిపై రాకపోకలు నిలిపివేసినట్లు పేర్కొన్నారు. SHARE IT..
Similar News
News December 10, 2025
తూ.గో: గ్రామీణ రహదారుల మరమ్మతులకు భారీగా నిధులు

గ్రామీణ రహదారుల మరమ్మతులు, నిర్మాణాల కోసం ఏపీఆర్ఎస్పీ పథకం కింద ప్రభుత్వం ప్రత్యేక నిధులను కేటాయించింది. ఉమ్మడి గోదావరి జిల్లాలకు ఏకంగా రూ.363.33 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో తూర్పుగోదావరి జిల్లాలో 57 పనులకు రూ.72.39 కోట్లు, కోనసీమ జిల్లాలో 78 పనులకు రూ.130.79 కోట్లు, కాకినాడ జిల్లాలో 106 పనులకు రూ.160.15 కోట్లు చొప్పున నిధులు కేటాయించారు.
News December 10, 2025
ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో క్రీడల ద్వారా ప్రతిభ: కలెక్టర్

ప్రత్యేక అవసరాలు గల పిల్లల్లో నమ్మకం, ధైర్యం, ప్రతిభను వెలికి తీయడంలో క్రీడలు కీలకపాత్ర పోషిస్తాయని కలెక్టర్ కీర్తి చేకూరి, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అన్నారు. రాజమండ్రిలోని ఎస్కేవీటీ కళాశాల ఆవరణలో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను కమిషనర్ ప్రారంభించారు. ప్రత్యేక ప్రతిభావంతులైన చిన్నారుల్లో అపారమైన సృజనాత్మకత, ప్రత్యేక కౌశలాలు దాగి ఉన్నాయని వారు పేర్కొన్నారు.