News September 2, 2024
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎంపీ

మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో వరద ప్రభావిత ప్రాంతాలను స్థానిక ఎంపీ బలరాం నాయక్ పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాల్లో ప్రజలతో ఎంపీ మాట్లాడి ప్రజలకు ధైర్యం చెప్పి నిత్యం అండగా ఉంటామని చెప్పారు. వరదల వల్ల తెగిపోయిన రోడ్ల మరమ్మతులను వెంటనే చేపట్టాలని ఎంపీ కోరారు. స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య, తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 22, 2025
‘మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం లక్ష్యం’

దేశ ప్రగతి మహిళల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని ఎంపీ కడియం కావ్య అన్నారు. హనుమకొండలో జరిగిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కోటి మంది మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు, పెట్రోల్ బంకులు, సోలార్ యూనిట్లు ఏర్పాటుతో పాటు పారిశ్రామిక అవకాశాలు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు.
News November 22, 2025
ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తనిఖీ

ఉర్సు గుట్ట వద్ద ఉన్న ఖిలా వరంగల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని జిల్లా రిజిస్ట్రార్ ప్రవీణ్ కుమార్ శనివారం మధ్యాహ్నం తనిఖీ చేశారు. ఆస్తుల రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ వసూలు, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉన్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. రిజిస్ట్రేషన్ పత్రాల ఆన్లైన్ ప్రక్రియను పరిశీలించారు. రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వారికి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచించారు.
News November 21, 2025
నర్సంపేట: డ్రంకెన్ డ్రైవ్ కేసులో ఒకరికి ఐదు రోజుల జైలు శిక్ష

నర్సంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19న పట్టణంలోని అంగడి సెంటర్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటో నడుపుతున్న పట్టణానికి చెందిన మేకల మహేందర్ మద్యం తాగి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈరోజు మహేందర్ను నర్సంపేట న్యాయస్థానంలో హాజరు పరచగా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీనారాయణ ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చినట్లు సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు.


