News September 10, 2024
వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే రూ.10లక్షల విరాళం
విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సీఎం సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సాయం కోసం ఎదురుచూస్తున్న వరద బాధితులకు అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అండగా నిలిచారు. తన వంతు రూ.10 లక్షలను విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు చెక్కును సీఎం చంద్రబాబు నాయుడికి అందజేశారు. సీఎం ఎమ్మెల్యే దగ్గుపాటిని అభినందించారు.
Similar News
News October 9, 2024
అనంతపురం జిల్లాకు వర్ష సూచన
అనంతపురం జిల్లాలో రానున్న 5 రోజుల్లో తేలిక పాటి నుంచి చిరు జల్లులు కురిసే అవకాశం ఉన్నట్లు రేకులకుంటలో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పరిశోధనా స్థానం అధిపతి, ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ విజయ శంకర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. పగటి ఉష్ణోగ్రతలు 32.5-34.8, రాత్రి ఉష్ణోగ్రతలు 23.5-24.6 డిగ్రీలు నమోదు అవుతుంనది పేర్కొన్నారు. గాలిలో తేమ శాతం ఉదయం 80-83 శాతం నమోదయ్యే అవకాశం ఉందని అన్నారు.
News October 9, 2024
అనంతపురంలో పోక్సో కేసు.. నిందితుడి అరెస్ట్
బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిపై పోక్సో కేసు నమోదైంది. అనంతపురం నగరంలోని జాకీర్ కొట్టాలకు చెందిన రవీంద్ర బాలిక(7)ను తన ఇంటి వద్దకు పిలిపించుకని అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై నిందితుడిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేయగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించినట్లు రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.
News October 9, 2024
ఎరువుల అమ్మకాలు జరిగేలా చర్యలు: కలెక్టర్ డా.వినోద్ కుమార్
జిల్లాలోని అన్ని కోఆపరేటివ్ సొసైటీల్లో ఎరువుల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కోఆపరేటివ్ అభివృద్ధి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 34 కోఆపరేటివ్ సొసైటీలు ఉండగా, అందులో11 సొసైటీలలో ఎరువుల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు.